
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)మరియు టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ (Spirit) మూవీ షూటింగ్ శరవేగంగా దూసుకుపోతోంది. ఈ భారీ ప్రాజెక్టుకి సంబంధించి సినీ ప్రియులలో అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ గురించిన ఒక అదిరిపోయే అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ బ్యూటీ, త్రిప్తి డిమ్రి(Triptii Dimri)నిన్నటి నుంచే స్పిరిట్ సెట్స్ లోకి అడుగుపెట్టింది. అలా అడుగుపెట్టిందో లేదో ఇనిస్టాగ్రమ్ వేదికగా ఒక పిక్ జారీ చేసింది. సదరు పిక్ లో ఒక ఆవు, పొలం కనపడుతూ ఉన్నాయి.ఇప్పుడు ఈ పిక్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిత్ర యూనిట్ ప్లాన్ ప్రకారం ఈ షెడ్యూల్‌ను సుదీర్ఘంగా ప్లాన్ చేశారు. దాదాపు 25 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన టాకీ పార్ట్‌తో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా షూట్ చేయనున్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, సుమారు 42 డిగ్రీల ఎండని సైతం లెక్కచేయకుండా చిత్ర బృందం షూట్ లో పాల్గొంటుంది. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా ఒక పవర్‌ఫుల్ రోల్‌లో చేస్తున్న విషయం తెలిసిందే.
Also read: కొత్త మూవీకి సంబంధించిన 66 హార్డ్ డిస్క్‌లు మాయం!.. కోట్లలో నష్టం
సందీప్ రెడ్డి వంగా మార్క్ రగ్గడ్ ,హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నస్పిరిట్ లో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది.






