నాగార్జున ఫ్యామిలీ హీరో తల్లిపై పోలీస్ కేసు!
on Sep 19, 2023
అక్కినేని నాగార్జున ఫ్యామిలీలో నాగచైతన్య, అఖిల్ హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. సుమంత్, సుశాంత్ కూడా గతంలో కొన్ని సినిమాల్లో హీరోలుగా నటించారు. వీరిలో సుశాంత్.. నాగార్జున చెల్లెలు ఎ.నాగసుశీల తనయుడు. కొడుకుని హీరోగా పెట్టి ‘కాళిదాసు’, ‘కరెంట్’, ‘అడ్డా’, ‘ఆటాడుకుందాం రా’ వంటి సినిమాలను చింతలపూడి శ్రీనివాసరావుతో కలిసి నిర్మించారు. ఆ సినిమాలు కమర్షియల్‌గా అంత సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల కలిసి కొంతకాలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఆ సమయంలోనే చింతలపూడిపై కేసు పెట్టింది నాగసుశీల. తనకు తెలియకుండా భూముల్ని అమ్ముకున్నాడని ఆమె కేసు పెట్టింది.
తాజాగా మరోసారి నాగసుశీల, చింతలపూడి శ్రీనివాసరావు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు కేసు పెట్టడం చింతలపూడి శ్రీనివాసరావు వంతు అయింది. నాగసుశీలతోపాటు 12 మంది కలిసి తనపై దాడి చేశారని మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు చింతలపూడి. ఎప్పటి నుంచో లావాదేవీల విషయంలో వీరిమధ్య గొడవలు ఉన్నాయి. అవి పెరిగి ఇప్పుడు పోలీస్ కేసు వరకు వెళ్ళాయి. ఇది టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
