
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)నుంచి వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇం డియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'(Peddi). 1980ల నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో, క్రీడల ద్వారా ఒక సామాన్యుడు తన గ్రామాన్ని ఎలా ఏకం చేశాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు విజయవాడ నగర నడిబొడ్డులో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కొద్దీ సేపటి క్రితమే ప్రారంభమయ్యాయి.
ఈ మెగా వేడుకకి అభిమానులతో పాటు అశేష జనవాహిని తరలివచ్చింది. మధ్యాహ్నం 2 గంటల నుండే విజయవాడ నగర వీధులన్నీ మెగా అభిమానుల నినాదాలతో మారుమోగిపోయాయి. స్టేడియం సామర్థ్యానికి మించి వేలాది మంది అభిమానులు తరలిరావడంతో బెజవాడలో ఎటు చూసినా జనసంద్రమే కనిపించింది. ఇతర జిల్లాల నుండి దాదాపు 50,000 మందికి పైగా అభిమానులు ఈ చారిత్రాత్మక క్షణాన్ని కళ్లారా చూసేందుకు విజయవాడకి చేరుకోవడం ఈ ఈవెంట్ రేంజ్‌ను చూపిస్తోంది. ఈవెంట్ ప్రారంభమైన కాసేపటికే స్టేడియం లోపల ఉన్న గ్యాలరీలు మొత్తం నిండిపోయాయి. దీంతో చరణ్ తన స్టామినా ఏ పాటిదో మరో సారి చాటి చెప్పినట్లయింది.
Also read: Dhurandhar: ధురంధర్ పై దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ఆగ్రహం..ముంబైలో భారీ ఉగ్రకుట్రకి ప్లాన్
ఆ పబ్లిక్ ని చూసిన తర్వాత హైదరాబాద్ లో రెగ్యులర్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో అయితే సరిపోయేది కాదని సినీ పరిశీలకులు అంటున్నారు. ఈ వేడుకలో రామ్ చరణ్ స్పీచ్ తో పాటు మిగతా నటీనటులు, దర్శకుడు ఏం మాట్లాడతారనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.






