
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ వన్ మాన్ షో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న విజయవాడలో కనివిని ఎరుగని రీతిలో అత్యంత అట్టహాసంగా జరిగింది. నగరంలో ఉన్న ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అత్యంత వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ భారీ వేడుకకు దాదాపు 30,000 మందికి పైగా అభిమానులు మరియు ప్రేక్షకులు తరలిరావడంతో విజయవాడ నగరం మొత్తం మెగా నామస్మరణతో మార్మోగిపోయింది. కొంత మంది ఫ్యాన్స్ స్టేడియం వద్ద ఉన్న పెద్ద పెద్ద చెట్లు ఎక్కడంతో చిత్ర యూనిట్ తో పాటు పోలీసులు కంగారు పడ్డారు. కానీ ఆ తర్వాత కిందకి దించారు. ఆ ఒక్క విషయం తప్ప గ్రాండ్ గా జరిగిన పెద్ది వేడుకలో ప్రధాన హైలెట్స్ గా నిలిచిన వాటిని చూద్దాం.
1 . 50000 మందికి పైగా వచ్చినట్టుగా అన్ని బ్యారక్ లు ఫుల్ కావడం
2 . రామ్ చరణ్ స్టైలిస్ట్ లుక్ అండ్ స్పీచ్
3 . జగపతిబాబు స్పీచ్ మరియు తనది విజయవాడే అని గుర్తు చెయ్యడం
4 . చిరంజీవి పొజిషన్ కి చరణ్ వస్తాడని మైత్రి నిర్మాత నవీన్ చెప్పడం
5 . జగదేక వీరుడు అతిలోకసుందరిలోని చిరంజీవి, శ్రీదేవి మానవ డైలాగ్ ని జాన్వీ కపూర్ చెప్పడం
6 . పెద్ది సాంగ్స్ వినిపించిన ఏఆర్ రెహమాన్ ఆర్కెస్ట్రా
7 .చరణ్ లేనిదే పెద్ది లేదని నిర్మాత వెంకట సతీష్ చెప్పడం
8 .మరిన్ని ఫంక్షన్స్ విజయవాడలో జరపాలని మాట్లాడిన ఎంపి కేశినేని నాని స్పీచ్
9 చరణ్ గురించి బుచ్చిబాబు చెప్పిన స్పీచ్
10 .రామ్ బుజ్జి గా చేస్తున్న దివ్యేన్దు శర్మ గురించి వినిపించిన ప్రతి సారి ప్రేక్షకుల నుంచి వినిపించిన అద్భుతమైన రెస్పాన్స్
Also read: Gunasekhar: త్రివిక్రమ్ పై గుణశేఖర్ వ్యాఖ్యలు వైరల్.. నా పాయింట్ సక్సెస్ అయినందుకు హ్యాపీ
ఇక జూన్ 4 రిలీజ్ డేట్ అయినా 3 నుంచే ప్రీమియర్స్ పడటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ది సందడి వాతావరణం నెలకొని ఉంది. ఏప్రిల్, మే నెలల్లో సరైన పెద్ద సినిమాలు లేక వెలవెలబోయిన థియేటర్లకి 'పెద్ది'సరికొత్త ఊపిరి పోస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.






