Home

»

Latest News

Peddi: ‘పెద్ది’కి పోటీ లేదు.. పాన్ ఇండియాకు రామ్ చరణ్ పవరేంటో చూపించే టైం వచ్చింది!

May 05, 2026

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi). జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అడ్వాంటేజ్‌ను సొంతం చేసుకోబోతోంది.

ఈ ఏడాది జూన్ 4న ‘పెద్ది’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ రిలీజ్ డేట్ ‘పెద్ది’కి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది. తెలుగు రాష్ట్రాల్లో సోలోగా విడుదలవుతోంది. 'టాక్సిక్' పోస్ట్ పోన్ కావడంతో సౌత్ లో ఎటువంటి పోటీ లేదని చెప్పవచ్చు. ఇక నార్త్ ఇండియాలోనూ భారీ బాలీవుడ్ సినిమాల పోటీ లేకపోవడం రామ్ చరణ్‌కు కలిసి రానుంది. ఓపెనింగ్స్ పరంగా ‘పెద్ది’ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఓపెనింగ్స్ కి తగ్గట్టుగా పాజిటివ్ టాక్ తోడైతే.. రామ్ చరణ్ బాక్సాఫీస్‌ పవర్ పాన్ ఇండియా స్థాయిలో మోతమోగిపోవడం ఖాయం.

చిత్ర ప్రమోషన్ల విషయంలో కూడా యూనిట్ చాలా పక్కాగా వ్యవహరిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హీరో హీరోయిన్లు స్వయంగా పాల్గొని సినిమాను ప్రమోట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్‌కు ఉన్న గ్లోబల్ ఇమేజ్, జాన్వీ కపూర్ క్రేజ్ ఈ సినిమాకు నార్త్ బెల్ట్‌లో మంచి మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇతర భాషల్లో కూడా ఆ సమయంలో భారీ రిలీజ్‌లు లేకపోవడంతో ‘పెద్ది’కి పాన్ ఇండియా రేసులో లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది.

మొత్తానికి, బుచ్చిబాబు మార్కు ఎమోషనల్ కంటెంట్ గనుక ప్రేక్షకులకు కనెక్ట్ అయితే, ‘పెద్ది’ మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్‌గా నిలవడం ఖాయం. సరైన రిలీజ్ టైమింగ్, బలమైన ప్రమోషన్లతో మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com