Home

»

Latest News

Peddi: పెద్ది క్లైమాక్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు.. సీక్రెట్ లీక్ చేసిన యాక్టర్!

May 27, 2026 1:03PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ 'పెద్ది' (Peddi). ఉత్తరాంధ్ర కుస్తీ బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. సినిమాలో కీలక పాత్ర పోషించిన సీనియర్ రంగస్థల నటుడు సత్యనారాయణ వడ్డాది 'తెలుగువన్' (TeluguOne) ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఈ చిత్రంలో కుస్తీ పోటీల సంఘం పెద్దల్లో ఒకరిగా సత్యనారాయణ ఒక పవర్‌ఫుల్ విలేజ్ క్యారెక్టర్‌ను పోషించారు. తన పాత్ర లుక్ కోసం వింటేజ్ క్యాప్, రేబాన్ గ్లాసెస్ మరియు చేతిలో ఎప్పుడూ సిగరెట్ ఉండేలా డైరెక్టర్ బుచ్చిబాబు డిజైన్ చేశారని ఆయన చెప్పారు. మొదటి రోజే సెట్స్‌లోకి వెళ్ళినప్పుడు క్యారవాన్ నుండి తన లుక్ చూసి చిత్ర యూనిట్ మొత్తం ఫిదా అయిపోయిందని, బుచ్చిబాబు గారు తన ఎంట్రీ షాట్‌ను చాలా క్లోజప్‌గా ఎంతో అద్భుతంగా చిత్రీకరించారని సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు.

ఇక రామ్ చరణ్ డెడికేషన్ గురించి చెప్తూ.. సెట్స్‌లో చరణ్ టవల్ కప్పుకుని వచ్చేవారని, షాట్ కోసం ఆ టవల్ తీసి కుస్తీ పహిల్వాన్ అవతారంలో చూసినప్పుడు తమకు ఒళ్ళు జలదరించిందని సత్యనారాయణ పేర్కొన్నారు. నిజమైన కుస్తీ ఫైటర్ లాగా చరణ్ బాడీ లాంగ్వేజ్ మరియు జుట్టు ముడి వేసిన లుక్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుందని అన్నారు. షూటింగ్ సమయంలో చరణ్ మోకాళ్లకు దెబ్బలు తగిలినా, చేతులు బెణికినా లెక్కచేయకుండా డూప్ లేకుండా ఎంతో రియలిస్టిక్‌గా కుస్తీ ఎపిసోడ్స్ చేశారని కొనియాడారు.

సినిమాలోని ఇతర ప్రధాన ఆకర్షణల గురించి మాట్లాడుతూ, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఎంట్రీ అదిరిపోతుందని చెప్పారు. ఆయన కుస్తీ మైదానంలోకి అడుగుపెడుతుంటే ఒక సింహం అడవిలోకి వస్తున్నట్లు ఉంటుందని వర్ణించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా సెట్స్‌కు వచ్చి చరణ్ ఫైట్ సీన్స్ చూసి ఎంతో ఎంజాయ్ చేశారని గుర్తుచేసుకున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు ఎంతో ప్రశాంతంగా, పక్కా ప్లానింగ్‌తో ఎక్కడా హడావుడి లేకుండా ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కించారని ప్రశంసించారు.

సినిమా ముగింపు గురించి ఆయన ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. 'పెద్ది' సినిమా క్లైమాక్స్ దాదాపు 30 నిమిషాల పాటు ఉంటుందని, ఆ సీన్స్ చూసి థియేటర్లలో ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుని భావోద్వేగంతో బయటకు వస్తారని చెప్పారు. ఒక గ్లోబల్ స్టార్‌ను బుచ్చిబాబు చూపించిన విధానం, గుండెల్ని పిండేసే ఎమోషన్స్ ప్రేక్షకుడి మైండ్ నుండి నాలుగైదు రోజుల వరకు అస్సలు పోవని సత్యనారాయణ చెప్పారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com