
మస్సా, మస్సా అంటు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(Ram Charan)తన వన్ మాన్ షో పెద్ది(Peddi)తో పాన్ ఇండియా థియేటర్స్ ని షేక్ చేస్తన్న విషయం తెలిసిందే. తన ఊరి గుర్తింపు కోసం పెద్ది చేసిన పోరాటానికి అభిమానులు,ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.ఆ భావోద్వేగ ప్రయాణం కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రియులను థియేటర్లకు పరుగులు పెట్టేలా చేస్తోంది.
వరుసగా 14వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలకడగా రాణించడం విశేషం. తాజా ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం, 14వ రోజు (రెండవ బుధవారం) ఈ చిత్రం ఇండియా నెట్ కలెక్షన్ల పరంగా 1.97 కోట్ల రూపాయల నుండి 2.45 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. వీక్‌డేస్ కావడం వల్ల కలెక్షన్లలో 29 శాతం మేర తగ్గుదల కనిపించినప్పటికీ, రెండు వారాల సుదీర్ఘ రన్ తర్వాత కూడా ఈ స్థాయిలో వసూళ్లు రావడం చరణ్ మాస్ స్టామినాకు నిదర్శనం. ముఖ్యంగా తెలుగు వెర్షన్ నుండే అత్యధికంగా 2.03 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించడం గమనార్హం.
రెండు వారాల ప్రదర్శన ముగిసేసరికి 'పెద్ది' చిత్రం కేవలం భారతదేశంలోనే ఏకంగా 225.52 కోట్ల రూపాయల భారీ నెట్ వసూళ్లను సాధించింది. ఇక ఇండియా గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూస్తే ఈ మార్కు 266.89 కోట్ల రూపాయలకి పైగా దాటిపోయింది. కేవలం మొదటి వారంలోనే 193.55 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసిన ఈ సినిమా, రెండవ వారంలో శనివారం 8.10 కోట్లు, ఆదివారం 9.20 కోట్ల రూపాయలు సాధించి సండే బ్లాక్‌బస్టర్ హవాని ప్రదర్శించింది. థియేటర్లలో తెలుగు వెర్షన్ పరంగా బుధవారం నాడు దాదాపు 18.69 శాతం అక్యుపెన్సీ నమోదైంది. విశాఖపట్నం, మహబూబ్‌నగర్, వరంగల్ వంటి ప్రధాన కేంద్రాలలో ఇప్పటికీ థియేటర్లు మంచి అక్యుపెన్సీతో నడుస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అధికారిక నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ప్రకటించిన వివరాల ప్రకారం, 'పెద్ది' చిత్రం కేవలం 13-14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్‌లో అడుగుపెట్టింది. ట్రేడ్ ట్రాకర్ల లెక్కల ప్రకారం కనీసం 320.20 కోట్ల రూపాయల గ్రాస్ దాటినట్లు స్పష్టమవుతోంది. దీనితో 2026 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ భారతీయ చిత్రంగా, అలాగే టాలీవుడ్ మరియు సౌత్ ఇండియాలోనే నంబర్ వన్ గ్రాసర్‌గా ఈ చిత్రం రికార్డులకెక్కింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 52.45 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
Also read: alpha: రీసెంట్ బెస్ట్ ట్రైలర్ కట్ ఇదే.. లంకని కాల్చడానికి సీతనే వచ్చింది కదా!
సినిమాకి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని, దర్శకుడు బుచ్చిబాబు సానా థియేటర్లలో ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చారు. గతంలో తొలగించిన సుమారు 5 నిమిషాల 56 సెకన్ల నిడివి గల అదనపు సీన్లను బుధవారం నుండి థియేటర్లలో తిరిగి యాడ్ చేశారు. జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన ఈ కీలక సన్నివేశాలు సినిమాకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. ఎఆర్ రెహమాన్ సంగీతం, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, బొమన్ ఇరానీ వంటి దిగ్గజాల నటన ఈ స్పోర్ట్స్ డ్రామాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ, చరణ్ నటన నన్ను అధిగమించిందని ప్రకటించడం పెద్ది సాధించిన అసలైన విజయం.






