
తెలుగు సినిమా ఎంతో మంది మగమహారాజులైన హీరోలని తనలో భద్రంగా ఉంచుకుంది. అందులో అలీ కూడా ఒకరు. ఐదు దశాబ్దాల క్రితమే బాలనటుడుగా ఎంట్రీ గాఇచ్చి కమెడియన్ గా విజృంభించి హీరోగానూ ఆ పరంపర కొనసాగించాడు. అంటే తెలుగు సినిమాకి అలికి ఉన్న అనుబంధం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: పెద్దిలో అచ్చాయమ్మ క్యారక్టర్ పై స్పందించిన జాన్వీ: వామ్మో అవేం మాటలు!
అలీ నిన్న హైదరాబాద్ లో జరిగిన లెజండ్రీ నటీమణి సూర్య కాంతం 102 వ జయంతి ఉత్సవాలకి హాజరయ్యాడు. ఈ మేరకు అలీకి సూర్య కాంతం స్మారక పురస్కారం కూడా అందుకున్నాడు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతు ఆ తరం నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఆ తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, లతో పని చేసే అవకాశం వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ , తెలుగు సినిమా అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ 'అలీ గారు పవన్ కళ్యాణ్ పేరు కూడా చెప్పుండాల్సింది. మీరు పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చిన మొదటి సినిమా నుంచి దాదాపుగా చాలా సినిమాల్లోను ఉన్నారనే విషయం మర్చిపోకండని అంటున్నారు.
[Pawan kalyan fans fire ali, Actor Ali Emotional Words About Suryakantham, Pawan kalyan About ali, ali about Pawan kalyan, Tollywood, Tollywood News, Telugu News, TeluguCinema]






