Home

»

Latest News

థియేటర్లలో ఈ సినిమాలు మిస్‌ అయ్యారా? ఓటీటీలో చూసి ఎంజాయ్ చెయ్యండి.!

Oct 30, 2026 11:34AM

ఈ శుక్రవారం ఓటీటీ ప్రేక్షకులకు రెండు కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. టాలీవుడ్‌ యంగ్‌ హీరో శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’, బాలీవుడ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘మీర్జాపూర్‌: ది మూవీ’ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్రారంభించాయి. ఈ రెండు సినిమాలు అక్టోబర్‌ 30 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అందుబాటులోకి వచ్చాయి. థియేటర్లలో ఈ సినిమాలను మిస్‌ అయినవారు ఇప్పుడు ఇంట్లోనే చూసే అవకాశం వచ్చింది.

ముందుగా ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ విషయానికి వస్తే.. శ్రీవిష్ణు, మహిమా నంబియార్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి జనకిరామ్‌ మారెళ్ల దర్శకత్వం వహించారు. 1992 నేపథ్యంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో కథ సాగుతుంది. ఓ చిన్న పట్టణంలో థియేటర్‌ నడుపుకునే కళ్యాణ్‌ (శ్రీవిష్ణు), సితార (మహిమా నంబియార్‌) ప్రేమలో పడతాడు. ఆమె కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తీర్చేందుకు స్నేహితుడు దుబాయ్‌ బాబు (సత్య)తో కలిసి ఓ పథకం వేస్తాడు. అయితే ఆ ప్రయత్నంలో అతడిని నిజమైన నక్సలైట్‌ నాయకుడిగా పోలీసులు, ఇతరులు పొరబడటంతో కథ అనూహ్య మలుపులు తిరుగుతుంది. రాధికా శరత్‌కుమార్‌, షైన్‌ టామ్‌ చాకో, ఉపేంద్ర లిమాయే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఐదు భాషల్లో ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఇక ‘మీర్జాపూర్‌: ది మూవీ’ విషయానికి వస్తే.. పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌, దివ్యేందు ప్రధాన పాత్రల్లో నటించారు. గుడ్డు పండిట్‌, మున్నా త్రిపాఠి, కాలీన్‌ భయ్యా పాత్రలను మరోసారి తెరపై చూసే అవకాశం ఈ సినిమాతో దక్కింది. అయితే ఇది వెబ్‌సిరీస్‌ మూడో సీజన్‌ తర్వాత జరిగే కథ కాదు. మొదటి సీజన్‌ కాలంలో చోటుచేసుకున్న పరిణామాలను చూపించే ఇంటర్‌క్వెల్‌గా రూపొందింది. జైసల్మేర్‌కు చెందిన బబ్బన్‌ బాబువా అనే వ్యక్తి మాదకద్రవ్యాల సరుకును దొంగిలించడంతో మీర్జాపూర్‌లో అధికార పోరు మొదలవుతుంది. ఆ తర్వాత చోటుచేసుకునే హింసాత్మక పరిణామాలు, ఆధిపత్య పోరాటమే ఈ సినిమా కథ. రవికిషన్‌, రసిక దుగల్‌, శ్వేతా త్రిపాఠి, జితేంద్ర కుమార్‌, అభిషేక్‌ బెనర్జీ తదితరులు నటించారు. థియేటర్లలో వచ్చిన వెర్షన్‌ కంటే అదనపు సన్నివేశాలతో కూడిన ఎక్స్‌టెండెడ్‌ కట్‌ ఇప్పుడు ప్రైమ్‌ వీడియోలో అందుబాటులో ఉంది.

 

 

[Comrade Kalyan OTT, Mirzapur The Movie OTT, Sree Vishnu, Mahima Nambiar, Pankaj Tripathi, Ali Fazal, Divyenndu, Amazon Prime Video, New OTT Releases October 30 2026, Telugu OTT Movies]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com