
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ #NTRNeel గురించి ఒక సాలిడ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఎన్టీఆర్ పుట్టినరోజు(మే 20) సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గ్లింప్స్ కి టైం కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం.
అర్థరాత్రి నుంచే ఊచకోత!
సాధారణంగా స్టార్ హీరోల పుట్టినరోజు అప్‌డేట్స్ ఉదయం వస్తుంటాయి. కానీ, ప్రశాంత్ నీల్ సినిమా అంటే ఆ లెక్కలే వేరుగా ఉంటాయి. తాజా సమాచారం ప్రకారం, మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో, దానికి ఒక రోజు ముందు అంటే మే 19 అర్థరాత్రి 12:06 గంటలకు ఈ సినిమా అధికారిక గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నారు.
ఈ గ్లింప్స్ ద్వారా ప్రశాంత్ నీల్ సృష్టించిన కొత్త ప్రపంచంలో తారక్‌ను ఎలా చూపించబోతున్నారో చిన్న శాంపిల్ చూపించనున్నారు. దీంతో మే 19 రాత్రి నుంచే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా మొదలుకానుంది.
నెక్స్ట్ లెవల్లో ఎలివేషన్స్
'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ఎన్టీఆర్‌ను ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. నీల్ మార్క్ డార్క్ థీమ్, భారీ ఎలివేషన్స్ ఈ సినిమాలో నెక్స్ట్ లెవల్లో ఉండబోతున్నాయని టాక్.
గ్లింప్స్ విడుదలయ్యాక ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయమని అంటున్నారు. ఖచ్చితంగా ఈ గ్లింప్స్ యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఆ అర్థరాత్రి రాబోయే విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలంటే మే 19 వరకు వేచి చూడాల్సిందే.
ఈ సినిమాకు మొదటి నుంచి 'డ్రాగన్' టైటిల్ ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్ బర్త్ డేకి టైటిల్ ను కూడా అధికారికంగా రివీల్ చేయనున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.






