Home

»

Latest News

తార‌క్ తో మ‌రోసారి డీఎస్పీ!?

Jan 28, 2022 3:35PM



యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ కి అచ్చొచ్చిన సంగీత ద‌ర్శ‌కుల్లో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఒక‌రు. `నా అల్లుడు` (2005), `రాఖీ` (2006), `అదుర్స్` (2010), `ఊస‌రవెల్లి` (2011), `నాన్న‌కు ప్రేమ‌తో` (2016), `జ‌న‌తా గ్యారేజ్` (2016), `జై ల‌వ కుశ‌` (2017).. ఇలా వీరి కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమాల‌న్నీ కూడా మ్యూజిక‌ల్ గా మెప్పించాయి. వీటిలో `అదుర్స్`, `నాన్న‌కు ప్రేమ‌తో`, `జ‌న‌తా గ్యారేజ్`, `జై ల‌వ కుశ‌` అయితే క‌మ‌ర్షియ‌ల్ గానూ రాణించాయి.

Also Read: హిమ‌జ‌కు టెన్త్ క్లాస్‌లో ద‌స‌రా రోజు ప్ర‌పోజ్ చేసిన అబ్బాయి!

ఇదిలా ఉంటే.. స్వ‌ల్ప విరామం అనంత‌రం తార‌క్, డీఎస్పీ కాంబోలో మ‌రో మూవీ రాబోతోంద‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `ఉప్పెన‌` వంటి సెన్సేష‌న‌ల్ హిట్ తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగేసిన బుచ్చిబాబు సానా.. త‌న రెండో సినిమాని ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అంతేకాదు.. స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామాగా రూపొంద‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ విజ‌య‌నగ‌రం నేప‌థ్యంలో సాగుతుంద‌ని స‌మాచారం. కాగా, `ఉప్పెన‌` చిత్రానికి చార్ట్ బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్ ఇచ్చిన దేవిశ్రీ‌నే ఈ మూవీకి కూడా సంగీత‌మందించ‌బోతున్న‌ట్లు బ‌జ్. త్వ‌ర‌లోనే తార‌క్ - బుచ్చిబాబు సానా కాంబో మూవీపైనా, అందులో డీఎస్పీ ఎంట్రీపైనా క్లారిటీ రానున్న‌ది. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com