
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఈ రోజు హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స జరుగుతుంది. దీంతో ఆరోగ్య పరిస్థితిపై సినీ ప్రపంచంతో పాటు కోట్లాది మంది అభిమానుల్లో ఆందోళన నెలకొంది. . ఇటీవల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ 'డ్రాగన్' షూటింగ్ లో కుడి భుజానికి గాయమైనట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి.
ఏది ఏమైనా ఎన్టీఆర్ భుజానికి ఆపరేషన్ ఏ విధంగా జరిగిందో తెలుసుకోవడానికి కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.శస్త్రచికిత్స అనంతరం వైద్యులు ఎన్టీఆర్ ఆరోగ్య వివరాలు వెల్లడించనున్నారు. ఎన్టీఆర్ ఆస్పత్రిలో చేరారనే వార్త నెట్టింట వైరల్ కావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. 'X' (ట్విట్టర్) వేదికగా #GetWellSoonNTR, #SpeedyRecoveryTarak వంటి హ్యాష్‌ట్యాగ్‌లు జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి. దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో అభిమానులు 'ప్రే' కూడా చేస్తున్నారు. చికిత్స పొందుతున్న సమయంలో ఎన్టీఆర్ గోప్యతని గౌరవించాలని తారక్ టీమ్ అభిమానులకి, మీడియాకి విజ్ఞప్తి చేసింది
Also Read: ఆ హీరోకి నేనంటే పిచ్చి.. ఎంత పని చేసావు మల్లికా
Ntr, Tollywood






