Home

»

Latest News

Ntr: బర్త్ డే కి నేషనల్ మీడియా.. నందమూరి ఫ్యాన్స్ కి పూనకాలే 

May 15, 2026

 


మే 20 మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)బర్త్ డే అనే విషయం తెలిసిందే. అభిమానులు  గత ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్టీఆర్ పేరిట పలు రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక ఈ సంవత్సరం ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ ఒక భారీ గిఫ్ట్ ఇస్తున్నాడు. 


ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్(Prashanth neel)కాంబోలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా డ్రాగన్ నుంచి  గ్లింప్స్ వస్తుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మే 19 మిడ్ నైట్ నే రిలీజ్ చేస్తారనే టాక్ కూడా వినపడుతుంది. తాజా సమాచారం ప్రకారం,  ఫస్ట్ గ్లింప్స్  వేడుకని కేవలం సౌత్ ఇండియాకి పరిమితం చేయకుండా, ముంబై వేదికగా పాన్ ఇండియా స్థాయిలో నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ మీడియా మరియు ప్రముఖుల సమక్షంలో ఈ గ్లింప్స్‌ని  లాంచ్ చేయడం ద్వారా డ్రాగన్ పై  దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ చేయాలనేది మేకర్స్ వ్యూహం.

Also read:  Urvashi rauthela: క్రిస్టల్ గౌన్ లో దేవకన్యలా ఊర్వశి రౌతేలా.. 1500 కోట్లు నిజమేనా!


మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers), ఎన్టీఆర్ ఆర్ట్స్(Ntr Arts)సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ముంబై లాంచ్ ఈవెంట్ గురించి అధికారిక ప్రకటన వెలువడితే,  ఫ్యాన్స్‌కి పండుగే అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ జత కడుతుంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com