Home

»

Latest News

'అలియాస్ రుక్మిణీ'కి నితిన్ షాకింగ్ రెమ్యూనరేషన్.!

Aug 4, 2026 4:47PM

హీరో నితిన్ 'అలియాస్ రుక్మిణీ' అనే కొత్త సినిమాని ప్రకటించాడు. న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రానికి 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకుడు. తాజాగా విడుదలైన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

జస్ట్ ఒక్క గ్లింప్స్‌ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన 'అలియాస్ రుక్మిణీ', ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే ఈ సినిమా కోసం నితిన్ కేవలం రూ. 4.5 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్‌గా అందుకుంటున్నాడట.

నితిన్ ఎప్పుడో పదేళ్ల క్రితమే 'అ ఆ' సినిమాకు రూ.5 కోట్లకు పైగా రెమ్యూనరేషన్‌ తీసుకున్నాడు. ఆ తర్వాత రూ.10-15 కోట్ల స్థాయిలో రెమ్యూనరేషన్‌ అందుకున్న రోజులు ఉన్నాయి. అలాంటి నితిన్, ఇప్పుడు ఐదు కోట్ల కంటే తక్కువకు సినిమా చేయడానికి ఒప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే దీని వెనుక బలమైన కారణముంది.

2020లో వచ్చిన 'భీష్మ' తర్వాత నితిన్ సక్సెస్ చూడలేదు. ప్రస్తుత తన ట్రాక్ రికార్డు, మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని.. రూ. 4.5 కోట్లకు సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

కొందరు హీరోలు ఫ్లాప్ లు ఎదురైనా రెమ్యూనరేషన్ తగ్గించకుండా నిర్మాతలకు భారం అవ్వడమే కాకుండా, తమ కెరీర్ ను కూడా ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. కానీ, నితిన్ ఆ తప్పు చేయకుండా.. రెమ్యూనరేషన్ విషయంలో వెనక్కి తగ్గడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

 

 

Alias Rukmini, Nithiin, Remuneration

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com