
రిలీజ్ డేట్ దగ్గర పడేకొద్దీ రామాయణ ప్రమోషన్స్ జెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోతున్నాయి.అంతే వేగంతో రామాయణ డబ్బింగ్ కి 'ఎఐ' టెక్నాలజీని ఉపయోగించారనే న్యూస్ కూడా అంతే వేగంతో సోషల్ మీడియా, సినీ ప్రేమికులు, రామ భక్తుల మనసులని కకావికలం చేస్తుంది. సహజత్వం పోతుందనేది వాళ్ల ఉద్దేశ్యం. అది నిజం కూడా. అందుకే ఈ విషయంలో దర్శకుడు నితీష్ తివారి క్లారిటీ ఇచ్చాడు.
నిన్న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ప్రపంచ స్థాయి ప్రీమియర్ ప్రదర్శన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హాజరైన నితీష్ తివారి మాట్లాడుతూ, సినిమాలో ఏఐ వాడకంపై జరుగుతున్న ప్రచారంలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ, దానిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సంభాషణల డబ్బింగ్ కోసం ఎక్కడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్‌లని ఉపయోగించలేదు. క్యారక్టర్ ల డైలాగ్స్ అన్నీ కూడా పూర్తిగా నిపుణులైన నిజమైన డబ్బింగ్ కళాకారుల (Real Artists) గొంతుతోనే చెప్పించాం.
ఇది కూడా చదవండి: ఏం తింటావయ్యా నువ్వు: 75 ఎక్కడా! 25 ఎక్కడా!

వివిధ భాషల్లో సినిమాను చూసే ప్రేక్షకులు తమ సొంత మాతృభాషలో అనుభూతి చెందేలా చేయడానికి, నటుల పెదవుల కదలికలకు (Lip-Syncing) తగినట్లుగా పర్ఫెక్ట్ సింక్ కుదరడం కోసం మాత్రమే పెదవుల కదలికలు సంభాషణలకి సరిపోయేలా చెయ్యడానికి బ్రహ్మ 'ఎఐ' ని ఉపాయించామని చెప్పుకొచ్చాడు. నవంబర్ 5 న రాముడు సీతా లక్ష్మణ సహేత ఆంజనేయ దారుడై వస్తున్న విషయం తెలిసిందే.
[Nitesh Tiwari Clarifies Ramayana Ai Dubbing, Nitesh Tiwari Ramayana, Ramayana AI dubbing, Ranbir Kapoor Ramayana movie, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]





