Home

»

Latest News

డిస్ట్రిబ్యూట్​ లవ్.. నిధి అగర్వాల్​ మంచి మనసు

May 26, 2021

కరోనా కష్టకాలంలో పలువురు సినీ సెలబ్రిటీలు తమ వంతు సాయం చేస్తూ సామాన్యులకు అండగా ఉంటున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్​ లో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా చేరింది. ‘డిస్ట్రిబ్యూట్​ లవ్’ పేరుతో ఒక ఆర్గనైజేషన్​ ను ప్రారంభించబోతున్నట్లు ఈ అందాల భామ ప్రకటించింది. 

“నేను డిస్ట్రిబ్యూట్​ లవ్​ పేరుతో ఛారిటబుల్ ఆర్గనైజేషన్ ​ను ప్రారంభిస్తున్నాను. ఈ కష్టకాలంలో సాయం కావాలనుకున్న వాళ్లు ఎవరైనా సరే ఈ వెబ్​ సైట్ ​కు రిక్వెస్ట్​ పెట్టొచ్చు. వారి అభ్యర్థనల మేరకు నేను వారికి చేతనైన సాయాన్ని అందిస్తా. నిత్యావసరాలు, మందులు.. ఇలా వారికి అవసరమైన ఏదైనా సహాయం చేయగలను. ఇది ముఖ్యంగా కోవిడ్ కోసం” అని నిధి అగర్వాల్ తెలిపింది. 

కాగా, 2017 లో బాలీవుడ్ చిత్రం 'మున్నా మైఖేల్'తో వెండితెర అరంగేట్రం చేసిన నిధి అగర్వాల్.. తెలుగు, తమిళ చిత్రాలలో హీరోయిన్ గా రాణిస్తోంది. ప్రస్తుతం క్రిష్​ డైరెక్షన్ ​లో పవన్​ కళ్యాణ్​ హీరోగా ‘హరిహరవీరమల్లు’లో హీరోయిన్​ గా నటిస్తోంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com