
-సినిమా పేరు: ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు
-నటీనటులు: వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్ప తులస్కర్, దేవీప్రసాద్, జ్వాలా కోటి, ఆడుకాలం నరేన్ , -వివేక్ రఘువంశీ తదితరులు
-సినిమాటోగ్రఫీ: కార్తిక్, సుజాత సాయికుమార్
-ఎడిటింగ్: విజయ్
-మ్యూజిక్: కళ్యాణ్ నాయక్
-నిర్మాత:వడ్డే నవీన్
-బ్యానర్: వడ్డే క్రియేషన్స్ ఎల్ ఎల్ పి
-రచన,దర్శకత్వం: కమల్ తేజ నార్ల
-రిలీజ్ డేట్ : జూన్ 19 , 2026
స్టార్ హీరో వడ్డే నవీన్ కొంత గ్యాప్ తీసుకొని ఈ రోజు ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులతో అభిమానులు, ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
త్రిమూర్తులు(వడ్డే నవీన్) సిన్సియర్ కానిస్టేబుల్. మంచి తనానికి కూడా మారు పేరు. భార్య లక్ష్మి( రాశి సింగ్), కూతురు రవళి అంటే ఎంతో ప్రేమ. ఇండియాలో ఎవరికీ లేని రేంజ్ లో 55 సార్లు ట్రాన్స్ ఫర్ కి గురవుతాడు. కమలాదేవి( శిల్ప తులస్కర్) రాజకీయాల్లో ఆరితేరిన నాయకురాలు. తన కొడుకు శాంటి ని ముఖ్యమంతిగా చేసి దేశరాజకీయాల్లోకి వెళ్లాలని చూస్తుంది.ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాంటి వాళ్ళతో త్రిమూర్తులుకి శత్రుత్వం ఏర్పడుతుంది. కమలాదేవి, శాంటిలతోత్రిమూర్తులుకి వైరం ఎందుకు ఏర్పడింది? కమలాదేవి, శాంటి లు సంఘ విద్రోహ శక్తులా? అలా అయితే వాళ్ళు చేసిందేంటి? వాళ్ళ విషయంలో త్రిమూర్తులు గెలిచాడా లేదా అనేదే చిత్ర కథ.
ఎనాలసిస్
ఇలాంటి కథనంతో కూడిన చిత్రాలు పదేళ్ల కిందట వస్తే బాగుండేది. అలాంటిది ప్రస్తుత రోజుల్లో మేకర్స్ ఏ ధైర్యంతో తెరకెక్కించారో అని మూవీ చూస్తున్నంత సేపు అనిపిస్తునే ఉంటుంది. ప్రస్తుత జనరేషన్ కి తగినట్టుగా ఒక్క సీన్ కూడా లేదు. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే మూవీ స్టార్టింగ్ క్యూరియాసిటీ కలిగించినా కథ జరిగే కొద్దీ చివరకి ఏం జరుగుతుందో తెలిసిపోతుంటుంది.త్రిమూర్తులు గురించి కూతురు కథగా చెప్పడం బాగుంది. కానీ ఆ తర్వాత వచ్చిన సీన్స్, వాటి తాలూకు పెర్ఫార్మ్ ఎన్నో సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. పొలిటికల్ సీన్స్ కూడా రొటీన్. ఫ్యామిలీ సీన్స్ మాత్రం సో సో. 20 ఏళ్ళ క్రితం తన తండ్రి దాచిపెట్టిన ఎఫ్ఐఆర్ కాపీని త్రిమూర్తులు ఎప్పుడెప్పుడు చూస్తాడనే క్యూరియాసిటీ కలిగించడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారు. ఇంటర్వెల్ ట్విస్ట్ పర్లేదు. సెకండ్ హాఫ్ లో వచ్చిన సీన్స్ ఏ మాత్రం క్యూరియాసిటీ కలిగించలేదు. కోర్టు సీన్స్, కూడా నార్మల్. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం పర్లేదు.
నటీనటులు,సాంకేతిక నిపుణుల పని తీరు
త్రిమూర్తులుగా నవీన్ పెర్ఫార్మ్ ఒక రేంజ్ లో ఉంది. గతంలో ఎంత ఎనర్జీని కనపరిచాడో , ఇప్పుడు అదే ఎనర్జీ. వైఫ్ గా రాశి సింగ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. దేవిశ్రీప్రసాద్ తో పాటు మిగతా నటీనటులు కూడా క్యారక్టర్ కి తగ్గ పెర్ఫార్మ్ చేసారు. దర్శకుడు కమల్ తేజ ఓల్డ్ టేకింగ్ తో మెప్పించలేకపోయాడు. రచయిత కూడా స్క్రిప్ట్ లో మెరుపులు చూపించే అవకాశం ఉన్నా ఆ దిశలో వెళ్లలేకపోయాడు. ఫొటోగ్రఫీ మైనస్.. నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు
1 . వడ్డే నవీన్ పెర్ ఫార్మెన్స్
2 . క్లైమాక్స్ ట్విస్ట్
బలహీనతలు
1 .ఓల్డ్ కథ, ఓల్డ్ నారేషన్
2 . డైరెక్షన్
3 . గ్రిప్పింగ్ లేని స్క్రీన్ ప్లే
చివరిగా చెప్పుకోవాలంటే పది పదిహేనేళ్ల క్రితం రావాల్సిన 'ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
రేటింగ్ 2 /5 అరుణాచలం




