
కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే విశాఖపట్నంలోని ప్రముఖ మెడికవర్ ఆసుపత్రికి (Vizag Medicover Hospital) తరలించారు. ఈ వార్త తెలియగానే అభిమానులు తీవ్ర ఆందోళనకి గురయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందోనని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పెద్ద ఎత్తున ఆరా తీయడం ప్రారంభించారు.
ప్రస్తుతం వైజాగ్ మెడికవర్ ఆసుపత్రిలో పండు మాస్టర్ వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. రీసెంట్ గా ప్రముఖ నటుడు '30 ఇయర్స్' పృథ్వీరాజ్ విశాఖపట్నంలోని మెడికవర్ ఆసుపత్రికి స్వయంగా వెళ్లి పండు మాస్టర్‌ని పరామర్శించారు. ఐసీయూలో ఉన్న పండును కలిసి, ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం అక్కడ చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతాప్ రెడ్డితో పృథ్వీరాజ్ ప్రత్యేకంగా మాట్లాడారు. పండు మాస్టర్‌కి జరిగిన గాయాలు, అందుతున్న వైద్య సేవలు, కోలుకోవడానికి పట్టే సమయం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పండు మాస్టర్ ప్రాణాపాయం నుండి సురక్షితంగా బయటపడ్డారని మరియు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా మెరుగుపడుతోందని డాక్టర్లు పృథ్వీరాజ్‌కి వివరించారు.
Also read: Peddi: కోడి రామ్మూర్తి నాయుడు ఇంటికి 'పెద్ది' టీమ్.. వీరఘట్టంలో హల్ చల్
పృథ్వీరాజ్ ఆసుపత్రికి సంబంధించిన కొన్ని ఫోటోలని తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతాలో పంచుకుంటూ 'పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రమాదం జరిగిన తొలినాళ్లలో పండు మాస్టర్ పరిస్థితి కొంచం ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు 48 గంటల పాటు ఐసీయూలో ఉంచారు. పండు మాస్టర్ కాలు, శరీరంపై కొన్ని చోట్ల తీవ్రమైన ఫ్రాక్చర్లు అయినట్లు సమాచారం. వైద్యులు రాత్రింబగళ్లు శ్రమించి అందించిన మెరుగైన వైద్యం వల్ల ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.





