Home

»

Latest News

'కరుప్పు' వివాదంలోకి కోలీవుడ్ ఫైనాన్షియర్.. డైరెక్టర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!

Jun 11, 2026 6:41PM

తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు సూర్య లీడ్ రోల్‌లో వచ్చిన రీసెంట్ మూవీ 'కరుప్పు' (తెలుగులో వీరభద్రుడు) థియేట్రికల్ రిలీజ్ సమయంలో ఎంతటి హై డ్రామా నడిచిందో అందరికీ తెలిసిందే. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొన్ని చోట్ల షోలు క్యాన్సిల్ అవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ సమయంలో ఈ సినిమా దర్శకుడు ఆర్జే బాలాజీ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూ, తాను కారులోనే కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నానంటూ చేసిన కామెంట్స్ సెన్సేషన్ అయ్యాయి. అయితే, తాజాగా ఈ అంశంపై కోలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఫైనాన్షియర్ తిరుప్పూర్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీశాయి.

దర్శకుడు ఆర్జే బాలాజీ అలా కన్నీరు కార్చడంపై తిరుప్పూర్ సుబ్రహ్మణ్యం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సినిమా మేకింగ్ సమయంలో బడ్జెట్‌పై నియంత్రణ కోల్పోవడం వల్లే నిర్మాతలకు ఇలాంటి కష్టాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. మొదట ఈ ప్రాజెక్ట్‌ను కేవలం 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ప్లాన్ చేశారని, ఆ తర్వాత అది 40 కోట్లకు చేరినా ఒక అర్థం ఉంటుందని.. కానీ ఏకంగా 80 కోట్ల రూపాయల మేర బడ్జెట్‌ను పెంచేయడం ఏంటని ఆయన నిలదీశారు. అంత భారీ భారాన్ని నిర్మాతపై వేసేటప్పుడు దర్శకుడికి బాధ్యత ఉండదా అని ఘాటుగా ప్రశ్నించారు.

సినిమా షూటింగ్ సమయంలో బడ్జెట్‌ను అదుపులో ఉంచకుండా, రిలీజ్ టైమ్‌లో సమస్యలు రాగానే దర్శకులు కారులో కూర్చుని ఏడవడం, వీడియోలు పెట్టడం కరెక్ట్ కాదని సుబ్రహ్మణ్యం హితవు పలికారు. ప్రొడ్యూసర్లు విడుదల ముందు రెండు మూడు నెలల పాటు డబ్బులు సర్దుబాటు చేయడానికి నానా సంకటాలు పడుతుంటే, ఏ దర్శకుడూ వారి అండగా నిలబడరని మండిపడ్డారు. అదే సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయితే మాత్రం సక్సెస్ క్రెడిట్ మొత్తం తమ ఖాతాలోనే వేసుకునేందుకు ముందుంటారని విమర్శించారు.

ఇదే క్రమంలో హీరో సూర్య వ్యవహరించిన తీరును మాత్రం తిరుప్పూర్ సుబ్రహ్మణ్యం కొనియాడారు. సూర్య తన రెమ్యునరేషన్‌లో కేవలం సగం మాత్రమే తీసుకుని, మిగిలిన మొత్తానికి ఆయనే పర్సనల్‌గా గ్యారెంటీ ఇచ్చారని వెల్లడించారు. సూర్య చూపించిన ఆ ఉదారత వల్లే ఈ సినిమా చివరకు థియేటర్లలోకి రాగలిగిందని, ఈ క్రెడిట్ అంతా సూర్యకే దక్కుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ సినిమా ప్లాప్ అయితే మిగిలిన బాకీలను దర్శకులు తీరుస్తారా అంటూ ఆయన వేసిన ప్రశ్నలు ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో పెను దుమారం రేపుతున్నాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వివాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది నెటిజన్లు దర్శకుడు ఆర్జే బాలాజీని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తుండగా, మరికొందరు మాత్రం ఒక క్రియేటర్‌గా సినిమా క్వాలిటీ కోసం బడ్జెట్ పెంచి ఉండొచ్చని సపోర్ట్ చేస్తున్నారు. ఏదేమైనా, సినిమా సక్సెస్ ఎంజాయ్ చేసే దర్శకులు, మేకింగ్‌లో వచ్చే ఆర్థిక నష్టాలకు కూడా అంతే బాధ్యత వహించాలనే చర్చను ఈ ఇష్యూ మరోసారి తెరపైకి తెచ్చింది. సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో, ఈ బడ్జెట్ లొల్లి కోలీవుడ్‌లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com