Home

»

Latest News

మహమ్మద్ సిరాజ్ ని పెళ్లాడనున్న స్టార్ హీరోయిన్!.. ఇదే సాక్ష్యం 

Jun 11, 2026 4:09PM

 

 

భారత స్టార్ ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ  మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడనే న్యూస్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రముఖ మోడల్, బిగ్ బాస్ ఫేమ్ బాలీవుడ్ నటి మాహిరా శర్మ(Mahira Sharma)సిరాజ్ వివాహం చేసుకోబోతున్నాడని, జూన్ చివరి వారంలోనే వీరిద్దరి పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఒక ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతా నుండి ఈ ట్వీట్ రావడంతో, అభిమానులంతా ఇది నిజమేనని నమ్మేశారు. దీనికి తోడు బీసీసీఐ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఈ రూమర్లకి  మరింత ఊతమిచ్చింది.

ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో మొదట సిరాజ్ పేరు ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో అతని స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణని  ఎంపిక చేశారు. వరుస మ్యాచ్‌ల వల్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ (విశ్రాంతి) దృష్ట్యా మెడికల్ టీమ్ సలహా మేరకు సిరాజ్‌కు విశ్రాంతిని ఇస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అయితే నెటిజన్లు మాత్రం, సిరాజ్ తన పెళ్లి పనుల కోసమే ఈ రెండు కీలక సిరీస్‌ల నుండి తప్పుకున్నాడంటూ సరికొత్త కథనాలు అల్లేశారు. గత కొన్ని నెలలుగా తీవ్రమైన క్రికెట్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్న సిరాజ్, టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టులో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున అన్ని మ్యాచ్‌లు ఆడి అలసిపోయాడు.

అయితే ఈ వైరల్ అవుతున్న పెళ్లి వార్తల వెనుక అసలు నిజం ఏమిటో తెలుసుకుంటే అభిమానులు షాక్ అవ్వడం ఖాయం. జూన్ చివరి వారంలో సిరాజ్, మాహిరా శర్మల వివాహం జరగబోతోందనే వార్త పూర్తిగా అబద్ధం. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం ఒక నకిలీ (ఫేక్) అకౌంట్ నుండి సృష్టించిన పోస్ట్ అని తేలిపోయింది. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ముఫాదల్ వోహ్రా పేరును పోలిన 'ముఫాహల్ వోబ్రా' అనే ఫేక్ ఐడీ నుంచి ఈ ట్వీట్ రావడంతో ఈ గందరగోళం మొదలైంది. వీరిద్దరికీ జూన్ నెలలో ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేవు.  


Also read: saanve Megghana: చేసిన ప్రతి మూవీ సూపర్ హిట్.. కానీ స్టార్‌డమ్ కోసం తెలుగు హీరోయిన్ ఎదురుచూపులు 


నిజానికి సిరాజ్, మాహిరా శర్మల మధ్య అఫైర్ ఉందంటూ గతంలో కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. గత ఏడాది ముంబైలోని ఒకే కేఫ్‌లో వీరిద్దరూ వేర్వేరు సమయాల్లో కనిపించడం, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవుతూ లైక్స్ కొట్టుకోవడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ సమయంలోనే మాహిరా శర్మ ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ, తాను ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేనని, తన పేరును అనవసరంగా క్రికెటర్‌తో ముడిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అటు సిరాజ్ కూడా ఇటువంటి రూమర్లపై గతంలో స్పందిస్తూ ఇవన్నీ అబద్ధాలని, తన వ్యక్తిగత జీవితంపై పాపరాజీలు ప్రశ్నలు అడగవద్దని కోరుతూ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని ఆ తర్వాత డిలీట్ చేశాడు. కాబట్టి తాజాగా వస్తున్న పెళ్లి వార్తల్లో నిజం లేదని భావించవచ్చు.  
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com