Home

»

Latest News

Ram Charan: 'వాలా 2' సక్సెస్ వెనుక రామ్ చరణ్.. సంచలన నిజాలు బయటపెట్టిన నిర్మాత!

Apr 25, 2026

మలయాళంలో సంచలన విజయం సాధించిన 'వాలా 2' (Vaazha 2) ఇటీవల తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక్కడ కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఒక కార్యక్రమంలో నిర్మాత సాహు గారపాటి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ప్రయాణంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అందించిన మద్దతు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ వేడుకలో సాహు గారపాటి మాట్లాడుతూ, రామ్ చరణ్ వ్యక్తిత్వం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. "రామ్ చరణ్ గారు అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా, మేము అడగగానే మాకు సపోర్ట్ చేశారు. 'వాలా 2' టీమ్ మొత్తాన్ని తన దగ్గరకు పిలిపించి, వారితో చాలా సమయం గడిపారు. సినిమా గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవడమే కాకుండా, మా టీమ్‌కి ఎంతగానో సపోర్ట్ ఇచ్చారు. అందుకు చరణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అని సాహు పేర్కొన్నారు.

రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు ఇలాంటి వైవిధ్యమైన చిత్రాలకు మద్దతు తెలపడం వల్ల సినిమా రేంజ్ పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో చరణ్ ఎప్పుడూ ముందుంటారని సాహు గారపాటి వ్యాఖ్యలు మరోసారి నిరూపించాయి. 

ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలు, సినిమా అప్డేట్స్ కోసం 'తెలుగువన్ సినిమా' (TeluguOne Cinema) యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com