
భగవంతునికి, భక్తుడికి మధ్య అనుసంధానమైంది అదేదో అగరబత్తి అనే మాట ఇప్పుడు ధురంధర్ సిరీస్ విషయంలో కూడా వర్తిస్తుంది. అంతలా రెండుభాగాలు ప్రేక్షకులని అలరిస్తూ థియేటర్స్ కి, ప్రేక్షకులకి మధ్య అనుసంధాన కర్తగా ఉంటు రికార్డు కలెక్షన్స్ ని సృష్టించాయి. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకి ధురంధర్ టీమ్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది.
Also read: Allu arjun: తిప్పరా మీసం.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ హంగామా
ఈ సెన్సేషనల్ స్పై థ్రిల్లర్ తెలుగు లాంగ్వేజ్ లో మే 31 నుంచి ప్రముఖ ఛానల్ స్టార్ మా లో మధ్యాహ్నం 2:30 గంటలకి టెలికాస్ట్ కానుంది. మరి దీన్ని బట్టి మీకు అర్ధమైన నిజం ఏంటంటే ఆ రోజు ధురంధర్ టెలికాస్ట్ టైంలో ఎవరి కాంటాక్ట్ కోసం ట్రై చేసిన దొరకరు. ప్రెజెంట్ ధురంధర్ 2 1800 కోట్ల చేరువలో ఉంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో ‘ధురంధర్’ పార్ట్ 1 రిలీజైన విషయం తెలిసిందే. మరి థియేటర్లలో రికార్డులు సృష్టించిన దురంధరుడు బుల్లితెరపై ఎలాంటి టీఆర్‌పీ రేటింగ్స్ సాధిస్తాడో చూడాలి.




