
-రెండు రోజుల్లో ఎలక్షన్స్
-రీసెంట్ గా ఇంటర్వ్యూ గా ఇచ్చిన విజయ్ తండ్రి
-ఏం చెప్పాడో, ఏం అంచనా వేశాడో అర్ధమవుతుంది
ఇళయ దళపతి విజయ్(Vijay)ఎల్లుండి జరగబోతున్న ఎన్నికల కదనరంగానికి సంబంధించి ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నాడు. అభిమానులు కూడా విజయ్ కి సంబంధించిన ఎక్స్ క్లూజివ్ న్యూస్ ని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే విజయ్ తండ్రి చంద్రశేఖర్(S.A Chandrasekhar)చెప్పిన మాటలతో విజయ్ ది ఎంత ముందు చూపో తెలుస్తుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ మాట్లాడుతు జన నాయగన్ ని ఒప్పుకున్నప్పుడే సదరు చిత్ర నిర్మాతలతో నేను రాజకీయాల్లోకి వెళ్తున్న టైంలో మూవీ చేస్తున్నారు. దీనివల్ల మీకు చాలా అడ్డంకులు ఎదురుకావచ్చు. వీటన్నింటికీ మీరు సిద్ధమేనా అని విజయ్ అడిగాడు. కాబట్టి జన నాయగన్ కి సెన్సార్ జాప్యం, లీక్ పై మాకేమి ఆశ్చర్యం కలగలేదు. కరెక్ట్ గా రిలీజ్ అయ్యి ఉంటే ఆశ్చర్యపోయే వాళ్ళం. మా అబ్బాయి రాజకీయ ప్రత్యర్థి కావడంతోనే జన నాయగన్ ని లీక్ చేసారు. కుటుంబమా, ప్రజలా అంటే విజయ్ ఓటు ప్రజలకే అని కూడా చంద్రశేఖర్ చెప్పుకొచ్చాడు.
also read: Parthiban: ఉస్తాద్ భగత్ సింగ్ పార్తీబన్ కులం విషయంలో హైకోర్టు కీలక తీర్పు.. దేశం ఎటువైపు వెళ్తుంది
ఇప్పుడు ఈ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. చంద్ర శేఖర్ పూర్తి పేరు ఎస్ ఏ చంద్ర శేఖరన్. 1978 లో దర్శకుడిగా మారిన చంద్రశేఖర్ తమిళ చిత్ర రంగంలో అగ్ర దర్శకుడిగా పేరు గడించాడు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో 'చట్టానికి కళ్ళు లేవు'ని తెరక్కించాడు. విజయ్ కి యాక్టింగ్ లో ఓనమాలు నేర్పడంతో పాటు విజయ్ హీరోగా నిలదొక్కుకునేలా చేయడానికి తన దర్శకత్వంలో విజయ్ కి మరుపురాని చిత్రాలని అందించాడు. కొన్ని చిత్రాల్ని నిర్మించాడు కూడా.





