
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఎడిటర్ మధు రెడ్డి (Madhu Reddi) హైదరాబాద్‌లోని మణికొండలో ఏప్రిల్ 18న గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సహచరులు, స్నేహితులు, ఆయనతో కలిసి పనిచేసిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి లోనయ్యారు.
కరీంనగర్‌కు చెందిన మధు రెడ్డికి ఎడిటర్‌గా ఇండస్ట్రీలో మంచి పేరుంది. సినిమాలోని ఎమోషన్ ను అర్థం చేసుకొని ఎడిటింగ్ చేయడంలో ఆయనకు మంచి పట్టు ఉంది. 'దళం', 'దక్ష', 'అహ నా పెళ్ళంట', 'జగమేమాయ', 'వాలెంటైన్స్ నైట్' వంటి సినిమాలతో పాటు, త్వరలో విడుదల కానున్న 'అగ్ని నక్షత్రం' లాంటి సినిమాలకు ఆయన వర్క్ చేశారు.
కేవలం ఫీచర్ ఫిలిమ్స్‌కు మాత్రమే కాదు.. ఆయన వందలాది సినిమాలకు ట్రైలర్ ఎడిటర్‌గా కూడా పనిచేశారు. 'జగడం', 'జల్సా' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల ట్రైలర్స్ కట్ చేసింది ఆయనే. ఆ ట్రైలర్స్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచడంలో ఆయన ఎడిటింగ్ మార్క్ ఎంతో ఉంది.
కరీంనగర్ నుండి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మధు రెడ్డి చిన్న వయసులోనే మరణించడం టాలీవుడ్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.






