Home

»

Latest News

Pawan Kalyan: ఒకేసారి రెండు భారీ సినిమాలు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్!

Apr 14, 2026

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు అదిరిపోయే న్యూస్. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, తన సినిమాల కోసం పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ‘OG’ సీక్వెల్, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

OG 2 - ఓజాస్‌ గంభీర.. అసలు విధ్వంసం ఇక్కడే!
గత ఏడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘OG’ సినిమాకి సీక్వెల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ పార్ట్ 2కు ‘ఓజాస్‌ గంభీర - ర్యాంపేజ్ బిగిన్స్’ (Ojas Gambheera - Rampage Begins) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో కేవలం శాంపిల్ మాత్రమే చూపించిన దర్శకుడు సుజీత్, ఈ సీక్వెల్‌లో పవన్ కళ్యాణ్ మార్క్ గ్యాంగ్‌స్టర్ గెటప్‌ను, యాక్షన్‌ను మరో లెవల్‌లో చూపించబోతున్నారట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్టును నిర్మించనున్నాయి.

అమరావతిలో సురేందర్ రెడ్డి ఆఫీస్.. స్క్రిప్ట్ వర్క్ షురూ!
మరోవైపు, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ కోసం ఒక భారీ యాక్షన్ డ్రామాను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం సురేందర్ రెడ్డి ప్రస్తుతం విజయవాడలో ఉండి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం అమరావతిలో ప్రత్యేకంగా ఆఫీస్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ మధ్యే సురేందర్ రెడ్డికి కొన్ని మార్పులు సూచించారని, ఆ మార్పుల తర్వాత వచ్చే ఫైనల్ నేరేషన్ పట్ల పవన్ పూర్తి సంతృప్తి చెందితేనే షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు టాక్. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు.

రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ‘OG 2’ కోసం సుజీత్ సిద్ధం చేసిన భారీ స్కెచ్, అమరావతి వేదికగా సురేందర్ రెడ్డి చేస్తున్న కసరత్తులు చూస్తుంటే, పవర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com