Home

»

Latest News

Raaka: రాకా కోసం దీపికా రికార్డు రెమ్యునరేషన్!.. ముగ్గురు హీరోలని కలిపినా అన్ని కోట్లు ఇస్తారా

Apr 12, 2026

 

-శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న రాకా
-దీపికా పదుకునే ముఖ్యమైన క్యారక్టర్ లో చేస్తున్న విషయం తెలిసిందే
-వైరల్ గా మారిన దీపికా రెమ్యునరేషన్ 
-భారతీయ చిత్ర పరిశమ్రలో ఆమె  రెమ్యునరేషన్ నే రికార్డా!
-పూర్తి డీటెయిల్స్ చూద్దాం

ఉన్న పళంగా ఒక సినీ అభిమాని ఒక న్యూస్ ని తన ఫోన్ లో చూసి రోడ్ పై వేగంగా పరుగెడుతున్నాడు. చూస్తున్న వాళ్ళకి అతను ఎందుకు అలా పరుగెడుతున్నాడో అర్ధం కావడం లేదు. అతను మాత్రం తన ఫేస్ లో నుంచి వస్తన్న సినీ ఆత్రాన్ని బహిరంగంగానే ప్రదర్శిస్తు తన వేగాన్ని ఆపకుండా ఇంకాస్త స్పీడ్ పెంచి పరుగెడుతూనే ఉన్నాడు. బహుశా పిటి ఉష, అశ్వని నాచప్ప వంటి టాప్ రన్నర్స్ ఆ వ్యక్తి స్పీడ్ చూస్తే కనుక, అతను పరుగు పందాల్లో ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి సరిపోయింది.  లేదంటే మనకి పేరు వచ్చేది కాదు అనుకునే వారు. దీన్ని బట్టి అతని వేగాన్ని అంచనా వేసుకోవచ్చు. మొత్తానికి తాను చేరాల్సిన ప్లేస్ కి చేరాడు. అక్కడ  ఉన్న తన మిత్రులతో ఓరే మావాస్ ఈ న్యూస్ విన్నారా!  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun),అట్లీ(Atlee),'రాకా'(Raaka)లో దీపికా రెమ్యునరేషన్ పలానా అని చెప్పాడు. అంతే వాళ్లంతా ఒక్కసారిగా నోరెళ్ళ బెట్టారు. అంత కెపాసిటీ ఉంది ఈ న్యూస్ కి. మరి ఆ డీటెయిల్స్ మనం కూడా చూద్దాం.

దీపికా పదుకునే(Deepika Padukone)..భారతీయ చిత్ర పరిశ్రమనే తనని ఏరికోరి పిలుపించుకుందా అనే స్థాయిలో తన చరిష్మాని  కొనసాగిస్తూ వస్తుంది. రాకా మేకర్స్ కూడా అదే విధంగా 'దీపికా'ని ఏరికోరి ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ మూవీకి దీపికా పాతిక కోట్ల రూపాయిల రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అవును.. అక్షరాలా పాతికకోట్లు. బహుశా భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక హీరోయిన్ అందుకున్న హయ్యస్ట్ రెమ్యునరేషన్ ఇదే కావచ్చు. వారణాసి(Varanasi)కి సంబంధించి ప్రియాంక చోప్రా ఆ స్థాయిలో తీసుకుందా లేదా అని డౌట్. దీపికా మాత్రం రాకాకి పాతిక కోట్లు అందుకుందనే న్యూస్ ఇండియన్ సినీ సర్కిల్స్ లో దర్జాగానే చక్కర్లు కొడుతుంది. రాకా నుంచి దీపికా క్యారక్టర్ కి సంబంధించిన ప్రచార చిత్రాలు చూస్తుంటే పోరాట యోధురాలుగా చేస్తుందనే విషయం అర్ధమవుతుంది. 

ఇక దీపికా రెమ్యునరేషన్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినీ అభిమానులు స్పందిస్తు తెలుగులో ముగ్గురు నార్మల్ యంగ్ హీరోల రెమ్యునరేషన్ కలిపినా దీపికా రెమ్యునరేషన్ అంత ఉండదనే కామెంట్స్ చేస్తున్నారు. రాకా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా వచ్చిన లుక్ తో అంచనాలు రెట్టింపయ్యాయి. అల్లు అర్జున్  కూడా దాదాపుగా  175 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకోబోతున్నట్టు టాక్. 'రాకా' రాక నెక్స్ట్ ఇయర్ సమ్మర్.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com