Home

»

Latest News

వర్మ 'రంగీలా'కు అగస్త్య మంజు అర్పిస్తున్న నీరాజనం 'బ్యూటిఫుల్'!

Oct 07, 2019

 

రాంగోపాల్ వర్మ కెరీర్‌లో 'రంగీలా' సినిమాకు ప్రముఖ స్థానముంది. తొలి సినిమా 'శివ'తోటే సంచలనం సృష్టించిన ఆయన.. హిందీలో ఊర్మిళ, ఆమిర్ ఖాన్, జాకీ ష్రాఫ్ కాంబినేషన్‌లో తీసిన 'రంగీలా' బ్లాక్‌బస్టర్ హిట్టయి, డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో సుస్థిర స్థానం సంపాదించుకోవడానికి దోహదం చేసింది. ఇప్పుడు ఆ సినిమాకి నీరాజనం పలుకుతూ ఆయన శిష్యుడు అగస్త్య మంజు 'బ్యూటిఫుల్' అనే సినిమా రూపొందిస్తున్నాడు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీకి వర్మతో పాటు అగస్త్య మంజు సైతం దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. 

'బ్యూటిఫుల్' సినిమాకు రచన చేస్తూ దర్శకత్వం వహిస్తున్న మంజు.. సినిమాటోగ్రఫీనీ అందిస్తున్నాడు. టైగర్ కంపెనీ బేనర్‌పై టి. నరేశ్‌కుమార్, టి. శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను అక్టోబర్ 9న రిలీజ్ చేయనున్నారు. తాజాగా '5 గ్లింప్సెస్' పేరుతో ఒక వీడియో యూట్యూబ్‌లో విడుదల చేశారు. బీచ్‌లో హీరో హీరోయిన్ల రొమాన్స్ కనిపిస్తున్న విజువల్స్ నిజంగా 'బ్యూటిఫుల్'గా ఉన్నాయి. పార్థ్ సూరి, నైనా గంగూలీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ వీడియో ప్రకారం 'బ్యూటిఫుల్' మూవీ రాంగోపాల్ వర్మ డ్రీమ్ అని తెలుస్తోంది. సిరాశ్రీ పాటలు రాయగా, రవిశంకర్ సంగీత స్వరాలు సమకూర్చాడు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com