Home

»

Latest News

అనుష్క క్రైమ్‌ థ్రిల్లర్‌ vs నాగశౌర్య యాక్షన్‌ థ్రిల్లర్‌

Dec 11, 2019

జనవరి మంత్‌ ఎండ్‌లో మంచి థ్రిల్లర్స్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. మేటర్‌ ఏంటంటే... రెండు థ్రిల్లర్స్‌ సేమ్‌ డేట్‌కి వస్తున్నాయి. అనుష్క చెవిటి, మూగ అమ్మాయిగా నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘నిశ్శబ్దం’. జనవరి 31న సినిమాను విడుదల చేస్తున్నట్టు ఈ నెలలోనే ప్రకటించారు. సేమ్‌ డేట్‌కి నాగశౌర్య హీరోగా నటించిన ‘అశ్వథ్థామ’ను విడుదల చేస్తున్నట్టు ఈ రోజు (బుధవారం) ప్రకటించారు. ఇదీ థ్రిల్లరే. యాక్షన్‌ థ్రిల్లర్‌ రెండూ సేమ్‌ డేట్‌కి వస్తుండడమే స్పెషాలిటీ. రెండు సినిమాలకూ కొన్ని స్పెషాలిటీస్‌ ఉన్నాయి.

అనుష్క ‘నిశ్శబ్దం’ విషయానికి వస్తే... క్రాస్‌ ఓవర్‌ సినిమాగా తెరకెక్కింది. ఇందులో కొందరు హాలీవుడ్‌ యాక్టర్స్‌ ఉన్నారు. అమెరికాలో చాలా రోజులు షూటింగ్‌ చేశారు. దాదాపుగా సినిమా అంతా అక్కడే, హాలీవుడ్‌ స్థాయిలో తీశారు. కథలో హీరో హీరోయిన్‌ అంటూ ప్రత్యేకంగా ఉండరు. ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్‌ ఉంటుంది. తొలిసారి అనుష్క చెవిటి, మూగ అమ్మాయిగా నటిస్తోంది. సినిమాలో అమె పెయింటర్‌ కూడా! మాధవన్‌ మ్యుజిషియన్‌గా, అంజలి పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తోంది. ఆల్రెడీ విడుదలైన టీజర్‌ ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది.

నాగశౌర్య ‘అశ్వథ్థామ’ విషయానికి వస్తే... దీనికి నాగశౌర్య కథ అందించాడు. అంతే కాదు... యాక్షన్‌ సీక్వెన్సుల కోసం చాలా కష్టపడ్డాడు. విశాఖలో యాక్షన్‌ సీన్స్‌ తీస్తున్నప్పుడు గాయాలు కావడంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. అయినా ఏమాత్రం రాజీ పడకుండా ఒరిజినల్‌గా స్టంట్స్‌ చేశాడు. ‘కేజీయఫ్‌’కు స్టంట్‌ కొరియోగ్రఫీ చేసిన అన్బు అరివు ఈ సినిమాకు పని చేశారు. ఇప్పటివరకూ స్టిల్స్‌ మాత్రమే విడుదల చేశారు. టీజర్‌ వస్తే క్లారిటీ వస్తుంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com