Home

»

Latest News

ప్లాన్ అదిరింది.. జై బాలయ్య 

Jun 25, 2026 2:26PM

గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ(Balakrishna)బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటని  కొనసాగించేందుకు సరికొత్త ఊరమాస్ ప్రాజెక్ట్‌తో సిద్ధమయ్యారు. ప్రీవియస్ చిత్రం ‘దేవర’ తో  సంచలన విజయాన్ని అందుకున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koralatala SIva)దర్శకత్వంలో బాలయ్య తన 112వ చిత్రాన్ని (NBK 112) స్టార్ట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి బిట్స్ పిలానీ గ్రౌండ్స్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. నందమూరి అభిమానులు, చిత్ర ప్రముఖుల కోలాహలం మధ్య ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ ఐటీ, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తొలి షాట్‌కి  క్లాప్‌ కొట్టారు. మావయ్య  సినిమా ప్రారంభోత్సవానికి లోకేష్ హాజరుకావడం అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు, దర్శకుడు గోపీచంద్ మలినేని తదితరులు క్లాప్ బోర్డ్ వేడుకలో పాల్గొని చిత్ర యూనిట్‌కి  బెస్ట్ విషెస్ తెలియజేశారు. అమరావతి కేంద్రంగా తెలుగు చిత్ర పరిశ్రమని  భారీ స్థాయిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాంతంలో షూటింగ్ జరుపుకోవడం విశేషం.

ఈ సినిమాను ఎస్‌ఎల్‌వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సుమారు 150 నుంచి 200 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలయ్య గతంలో నటించిన ఇండస్ట్రీ హిట్ ‘సింహా’ చిత్రానికి కొరటాల శివ రచయితగా పనిచేశారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ సెట్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. "పవర్ మీట్స్ పర్పస్.. మాస్ బికమ్స్ ఎ మూవ్‌మెంట్" అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రం పక్కా సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనుంది.

ఈ భారీ చిత్రంలో బాలయ్య సరసన బాలీవుడ్ వెర్సటైల్ నటి విద్యాబాలన్ కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. గతంలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రాల్లో ఎన్టీఆర్-బసవతారకం జంటగా అలరించిన ఈ హిట్ జోడీ, దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారనే ప్రచారం మూవీపై హైప్‌ని  మరింత పెంచేసింది.

తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశాలు ఉండగా, ఆగస్టు 2026 నుండి రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరగనుంది. ‘కార్పెంటర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రాన్ని ఆగష్టు లో షూటింగ్ స్టార్ట్ చేసి  2027 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య మార్క్ ఊరమాస్ ఎలిమెంట్స్, కొరటాల శివ సామాజిక సందేశం కలబోసి రాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com