Home

»

Latest News

NBK112: బాలయ్య, కొరటాల మూవీ.. ఏమిటీ గందరగోళం?

May 05, 2026

నందమూరి బాలకృష్ణ (Balakrishna), డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ప్రకటించిన తాజా చిత్రం 'NBK112' ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. "పవర్ మీట్స్ పర్పస్.. మాస్ బికమ్స్ ఏ మూవ్‌మెంట్" అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో అనౌన్స్ చేసిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఈ సినిమాకి సంగీతం ఎవరు అందిస్తారనే విషయంలో ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

మొదట ఈ సినిమా కోసం మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పేరు బలంగా వినిపించింది. కొరటాల శివ గత చిత్రం 'దేవర'కు అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వడంతో, ఈ చిత్రానికి కూడా ఆయనే ఉంటారని అందరూ భావించారు. కానీ, లేటెస్ట్ సమాచారం ప్రకారం అనిరుధ్ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఇప్పుడు రేసులో ఇతర సంగీత దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్.ఎస్. తమన్, దేవి శ్రీ ప్రసాద్ పేర్లు ప్రముఖంగా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

బాలయ్యకు 'అఖండ', 'వీరసింహా రెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' వంటి చిత్రాలకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన తమన్ వైపు మొగ్గు చూపుతారా? లేక కొరటాల శివతో 'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్‌కు అవకాశం ఇస్తారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఈ ఇద్దరిలో ఒకరు ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. బాలయ్య ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. త్వరలోనే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది చిత్ర బృందం అధికారికంగా వెల్లడించనుంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com