Home

»

Latest News

భారీ ధరకి ఆ ఏరియాలో ప్లాట్ కొన్న నయన్.. రజనీకాంత్ ని దాటిందా!

Jul 25, 2026 6:57PM

 

 

హీరో కట్ అవుట్ కి ధీటుగా రెండు దశాబ్దాల నుంచి సినిమా సినిమాకి  తన కట్ అవుట్ రేంజ్ ని పెంచుకుంటూ పోతున్న స్టార్ హీరోయిన్ నయనతార(Nayan Tara). మన శంకర వర ప్రసాద్ గారు విజయం ఇచ్చిన సక్సెస్ తో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ని సిద్ధం చేస్తుంది. అగస్ట్ 26 న టాక్సిక్ తో  సత్తా చాటడానికి రెడీ అవుతున్న నయన్ కి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.

ఇటీవల చెన్నైలోని అత్యంత విలాసవంతమైన, ప్రముఖుల నివాసప్రాంతమైన 'పోయెస్ గార్డెన్ (Poes Garden) లో సుమారు 40 కోట్ల విలువైన లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నూతన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్ చెన్నై తెయ్‌నాంపేట్ పరిధిలోని అత్యంత ప్రతిష్టాత్మక 'లెగసీ' (Legacy) ప్రాజెక్ట్‌లో 4 ,5వ అంతస్తులలో విస్తరించి ఉంది. ల్యాండ్‌మార్క్ మెట్రో ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా నిర్మితమైన ఈ గృహ సముదాయంలో  14,369 చదరపు అడుగుల సూపర్ బిల్ట్ అప్ ఏరియాని కలిగి ఉండటం విశేషం. దీనితో పాటు 5,308 చదరపు అడుగుల అవిభక్త భూమి వాటా (UDS) కూడా లభిస్తుంది. ఒక్కో చదరపు అడుగు ధర దాదాపు 21,946 వద్ద లెక్కించబడిన ఈ డీల్, 2025 డిసెంబర్ 15న అధికారికంగా రిజిస్టర్ అయింది. ఈ రాయల్ అపార్ట్‌మెంట్ కొనుగోలులో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ ఆస్తిలో నయనతార ఏకంగా 90 శాతం మెజారిటీ వాటా కలిగి ఉండగా, ఆమె భర్త విగ్నేష్ శివన్ మిగిలిన 10 శాతం వాటాని  కలిగి ఉన్నారు. అంతేకాక ఈ విలాసవంతమైన భవనంలో పార్కింగ్ కోసం ప్రత్యేకంగా 8 కవర్డ్ స్టిల్ట్ పార్కింగ్ స్లాట్లను కేటాయించారు.


Also read: ఆ ఇద్దరి హీరోలకి తల్లిగా నటించను.. శరణ్య సంచలన నిర్ణయం

చెన్నైలోని పోయెస్ గార్డెన్ అనగానే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నివాసం 'వేద నిలయం', అలాగే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గృహం అందరికీ గుర్తుకొస్తాయి. ఇటీవల ధనుష్ కూడా ఇదే ప్రాంతంలో దాదాపు .150 కోట్ల వ్యయంతో ఓ భారీ బంగళాని  నిర్మించుకున్న విషయం తెలిసిందే.

NayanThara, RajiniKanth, Dhanush

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com