Home

»

Latest News

బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి 'చాయ్‌ వాలే'లో న‌య‌న్ పెట్టుబ‌డులు!

Aug 2, 2021 4:30PM

 

లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార చాయ్ వాలేలో పెట్టుబ‌డులు పెట్టింది. క్విక్ స‌ర్వీస్ రెస్టారెంట్స్ (క్యుఎస్ఆర్‌) ఇండ‌స్ట్రీలో చెన్నైకు చెందిన‌ పానీయాల బ్రాండ్ అయిన చాయ్ వాలే వ‌చ్చే ఏడాది నాటికి 35 పూర్తిస్థాయి దుకాణాల‌ను ప్రారంభించ‌డం ద్వారా విస్త‌రించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. విస్త‌ర‌ణ‌లో భాగంగా పాత‌, కొత్త ఇన్వెస్ట‌ర్ల నుంచి మ‌రో ఐదు కోట్ల రూపాయ‌ల‌ను ఈ బ్రాండ్ సేక‌రించింది. 

న‌య‌న‌తార‌, ఆమె బాయ్‌ఫ్రెండ్ విఘ్నేశ్ శివ‌న్‌తో పాటు ఏంజెల్ ఇన్వెస్ట‌ర్స్ సునీల్ సేథియా, సునీల్ కుమార్ సింఘ్వీ, మ‌నీశ్ మ‌ర్దియా, ముంబైకు చెందిన ఏంజెట్ నెట్‌వ‌ర్క్ యుఎన్ఐ-ఎం నెట్‌వ‌ర్క్ ఈ పెట్టుబ‌డులు అందించారు. ఈ రౌండ్ నిధుల స‌మీక‌ర‌ణ‌లో అన్‌లిస్టెడ్ కార్ట్ ఎల్ఎల్పీ లాంటి ప్రైవేట్ సంస్థ‌లు కూడా ప్ర‌ధాన పాత్ర పోషించాయి.

"ప్ర‌స్తుతం సేక‌రించిన నిధుల్లో 80 శాతం దుకాణాల‌ను విస్త‌రించ‌డానికి వినియోగిస్తాం. వ‌చ్చే ఏడాదికి పూర్తి స్థాయిలో ప‌నిచేసే 35 దుకాణాలను తెర‌వాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాం. మిగ‌తా నిధుల్ని మార్కెంటింగ్‌, బ్యాక్‌-ఎండ్ సిస్ట‌మ్స్ విస్త‌ర‌ణ‌, నిర్వ‌హ‌ణ సిబ్బందికి కేటాయిస్తాం." అని చాయ్ వాలే ఫౌండ‌ర్ విదుర్ మ‌హేశ్వ‌రి చెప్పారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com