Balakrishna: బాలయ్య సాలిడ్ లైనప్.. లిస్టులో ఐదుగురు స్టార్ డైరెక్టర్స్!
on Jan 22, 2026

ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా బాలకృష్ణ లైనప్
లిస్టులో ఐదుగురు టాలెంటెడ్ డైరెక్టర్స్
బాక్సాఫీస్ ని షేక్ చేసే కాంబినేషన్స్ సెట్
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుసగా ఐదు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పుడు ఆ జోష్ ని కంటిన్యూ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర అంతకుమించిన సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఐదుగురు టాలెంటెడ్ డైరెక్టర్స్ తో చేతులు కలుపుతున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ తన నెక్స్ట్ మూవీని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. 'వీరసింహారెడ్డి' తరువాత బాలయ్య, మలినేని కాంబోలో వస్తున్న చిత్రమిది. (NBK 111)
గోపీచంద్ మలినేని తరువాత బాలకృష్ణ లైనప్ లో నలుగురు దర్శకులు ఉన్నట్లు సమాచారం. ఆ దర్శకులు ఎవరో కాదు.. అనిల్ రావిపూడి, కొరటాల శివ, బాబీ కొల్లి, వంశీ పైడిపల్లి.
'భగవంత్ కేసరి' తరువాత బాలకృష్ణ, అనిల్ రావిపూడి మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఒకవేళ గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ ఆలస్యమైతే.. దీనిని ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట.
ఇక కొరటాల శివ కూడా ఆ మధ్య బాలకృష్ణకు కథ వినిపించారని సమాచారం. కథ నచ్చి కొరటాలతో సినిమా చేయడానికి బాలయ్య ఓకే చెప్పారని, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో న్యూస్ వినిపిస్తోంది.
Also Read: సంక్రాంతి సినిమాల్లో ఎక్కువ లాభాలు చూసిన నిర్మాత ఎవరో తెలుసా?
బాలకృష్ణ, బాబీ కొల్లి కాంబినేషన్ లో నాగవంశీ నిర్మించిన మూవీ 'డాకు మహారాజ్'. ఈ కాంబోలో మరో చిత్రాన్ని నిర్మించే ఆలోచనలో నాగవంశీ ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి సినిమాతో బిజీగా ఉన్న బాబీ.. ఆ తర్వాత బాలయ్య ప్రాజెక్ట్ పైకి షిఫ్ట్ కానున్నారట.
దిల్ రాజు బ్యానర్ లో కూడా బాలకృష్ణ ఒక సినిమా కమిటై ఉన్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించే అవకాశముంది అంటున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్స్ తో పనిచేసిన పైడిపల్లి, కొంతకాలంగా బాలీవుడ్ ప్రయత్నాల్లో ఉన్నారు. అలాంటిది ఇప్పుడు బాలకృష్ణ నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు న్యూస్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఒక నూతన దర్శకుడు సైతం బాలకృష్ణకు సరిపోయే కథను సిద్ధం చేసి, దిల్ రాజుకి వినిపించినట్లు టాక్.
ప్రస్తుతం బాలకృష్ణ లైనప్ సాలిడ్ గా ఉంది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు సాధించగలిగిన సత్తా ఉన్నవే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



