Home

»

Latest News

విడాకులు తీసుకున్న నాగార్జున హీరోయిన్‌!

Dec 29, 2023 3:07PM

సినిమా అంటేనే మాయ. నిజ జీవితంలో జరగని, సాధ్యంకాని సంఘటనల సమాహారంగా సినిమా రూపొందుతుంది. కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా కూడా సినిమాలు రూపొందిస్తారు. అయితే ఎక్కువ శాతం కాల్పనిక ఘటనలే మనకు సినిమాలో దర్శనమిస్తాయి. ఆ సినిమాల్లో నటించే నటీనటుల జీవితాల్లో కూడా అలాంటి చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటూ వుంటాయి. ముఖ్యంగా సినిమా తారలు పెళ్లి చేసుకోవడం, కొన్నాళ్ళు కాపురం చేయడం, ఆ తర్వాత ఎంతో క్యాజువల్‌గా విడాకులు తీసుకోవడం మనం చూస్తున్నాం. ఈమధ్యకాలంలో అలాంటివి ఎన్నో జరిగాయి. ఈ విషయంలో పెద్ద తారలు, చిన్న తారలు అనే భేదం ఏమీ లేదు. ఎవరి విషయంలోనైనా ఇలాగే జరుగుతూ ఉంటుంది.

తాజాగా ఓ హీరోయిన్‌ విషయంలో కూడా అదే జరుగుతోంది. తెలుగు, హిందీ, తమిళ్‌తోపాటు మరికొన్ని భాషల్లో హీరోయిన్‌గా నటించిన ఇషా కొప్పికర్‌ తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఈ విషయం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇషా భర్త హోటల్‌ వ్యాపారి టిమ్మి నారంగ్‌ నుంచి విడాకులు తీసుకుంది. వీరి వివాహం 14 సంవత్సరాల క్రితం జరిగింది. వారికి తొమ్మిదేళ్ళ కూతురు కూడా ఉంది. తాజాగా తన కూతురితో కలిసి అత్తారింటి నుంచి బయటికి వచ్చేసిందని తెలుస్తోంది. ఈ విషయం గురించి ఇషా కొప్పికర్‌ను ప్రశ్నిస్తే.. ‘నేను దీని గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. ఇన్నాళ్ళ మా వైవాహిక జీవితం ముగిసిపోయింది. ఇప్పుడు నాకు ఒంటరితనం ఎంతో అవసరం’ అని సమాధానమిచ్చింది. ఒక జిమ్‌లో ఇషా, టిమ్మి పరిచయయారు. అది ప్రేమగా మారి కొన్నాళ్ళు ఇద్దరూ డేటింగ్‌ చేశారు. ఆ తర్వాత 2009లో వివాహం చేసుకున్నారు. 2014లో వారికి రియానా జన్మించింది.

ఇషా కొప్పికర్‌ హిందీ, తెలుగు, తమిళ్‌, కన్నడ, మరాఠి భాషల్లో చాలా సినిమాలు చేసింది. ఆమె పుట్టింది ముంబయిలోనే అయినా వంశీ డైరెక్షన్‌లో రామ్‌గోపాల్‌వర్మ నిర్మించిన ‘వైఫ్‌ ఆఫ్‌ వరప్రసాద్‌’ చిత్రంలో ఒక పాటలో కనిపించింది. ఆ తర్వాత నాగార్జున సరసన ‘చంద్రలేఖ’, వెంకటేష్‌ సరసన ‘ప్రేమతో రా’ చిత్రాల్లో నటించినప్పటికీ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అనుకున్నంత గుర్తింపు రాలేదు. అయితే బాలీవుడ్‌లో మాత్రం చాలా సినిమాలు చేసి హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఆమధ్య తెలుగులో వచ్చిన ‘కేశవ’ చిత్రంలో కూడా నటించింది. ఇప్పుడు నటిగా పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com