
ప్రచార చిత్రాలతో అభిమానులని ఏర్పరుచుకున్న చిత్రం 'నాగబంధం'.. భారతీయ చిత్ర పరిశ్రమ యావత్తు ఆశ్చర్యపోయే రీతిలో అత్యున్నత సాంకేతిక విలువలతో, హై టెక్నాలజీ వాల్యూస్ తో నిర్మాణం జరుపుకోగా రేపు అంటే జూలై 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల కాబోతోంది. అనంత పద్మనాభ స్వామి ఆలయం, పురాతన రహస్యాలు, దివ్యశక్తుల మహిమల చుట్టూ తిరిగే ఈ కథ ఒక సరికొత్త భక్తి ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు కీ రోల్స్.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఎక్కడా రాజీ పడకుండా కథపై నమ్మకంతో 110 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నాగబంధాన్ని ప్రేక్షకులకి మరింత దగ్గర చేయడానికి, విడుదలకు ముందే చిత్ర యూనిట్ బంపర్ ఆఫర్ ఒకటి ప్రకటించింది. బుకింగ్స్ పెంచేందుకు సరికొత్త మార్కెటింగ్ వ్యూహంతో 'బై వన్ గెట్ వన్' (BOGO) ఆఫర్‌ను బుక్‌మైషో ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఒక టికెట్ కొంటే మరొక టికెట్ ఉచితంగా లభించే ఈ ఆఫర్ సినీ ప్రియులని ఎంతగానో ఆకర్షిస్తోంది. అయితే ఈ అదిరిపోయే ఆఫర్ కేవలం 'నాగబంధం' హిందీ వెర్షన్‌కు మాత్రమే వర్తిస్తుందని, తెలుగు మరియు ఇతర ప్రాంతీయ భాషల వెర్షన్లకు వర్తించదని చిత్ర బృందం స్పష్టం చేసింది. ఏదేమైనా సనాతన ధర్మం, పురాతన ఆలయాల రహస్యాల నేపథ్యంలో వస్తున్న విజువల్ ఫీస్ట్‌ను వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అభిషేక్ నామ దర్శకుడు.
Also read: మళ్ళీ పుంజుకుంటున్న ప్లాప్ హీరోయిన్స్.. ఆ సెంటిమెంట్ కి కాలం చెల్లినట్లేనా!





