Home

»

Latest News

నాగవంశీ సంచలన వ్యాఖ్యలు: కలెక్షన్స్ పోస్టర్ల వెనుక అసలు నిజం ఇదే 

Aug 8, 2026 12:30PM

 

సోషల్ మీడియా పుణ్యమా అని హీరో కట్ రేంజ్ లో పేరు సంపాదించుకున్నాడు సితార ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొప్రయిటర్ నాగవంశీ. హిట్ ట్రాక్ లో రన్ అవుతూ వస్తున్న నాగవంశీ  ప్రీవియస్ మూవీ లెనిన్ తో మరో హిట్ ని తన లాకర్ లో భద్రపరుచుకున్నాడు. చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ కలెక్షన్లు, ప్రమోషన్ల హంగామా, పోస్టర్లపై కనిపించే భారీ సంఖ్యల వెనుక దాగున్న అసలు సత్యాలని నాగవంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో  వెల్లడించాడు.


కలెక్షన్స్ పై ఆయన మాట్లాడుతూ ;ఇప్పటికీ బాక్సాఫీస్ పోస్టర్లలో కలెక్షన్ల నంబర్లని   పెంచి చూపించడం జరుగుతోంది. అయితే పోస్టర్లపై ఎన్ని వందల కోట్లు అని రాసుకున్నప్పటికీ, అసలు లెక్కలేమిటో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులకి  పూర్తిగా తెలుసు. జీఎస్టీ (GST), టీడీఎస్ (TDS) వంటి ఆధునిక పన్ను వ్యవస్థలు అమలులోకి వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమలో నగదు లావాదేవీల స్వరూపమే మారిపోయింది. ఒకప్పుడు బ్యాంకింగ్ పరిధిలోకి రాని విధంగా జరిగిన చెల్లింపులు, ఇప్పుడు జీఎస్టీ రాకతో అత్యంత పారదర్శకంగా మారాయి. కలెక్షన్ల పోస్టర్లపై కనిపించే లెక్కలకు, నిర్మాణ సంస్థలు ప్రభుత్వానికి దాఖలు చేసే వాస్తవ ఆడిట్ నివేదికలకు మధ్య వ్యత్యాసం ఉంటుందనే విషయం ఐటీ అధికారులకి స్పష్టంగా తెలుసు. కాబట్టి వ్యాపార రీత్యా, పబ్లిసిటీ కోసం వేసే పోస్టర్ల ఆధారంగా పన్నుల శాఖను మోసం చేయడం సాధ్యం కాదని, ప్రతి ఒక్క రూపాయికీ చట్టబద్ధమైన లెక్కలు పక్కాగా ఉంటాయి.


Also read: హీరోగా గ్రాండ్ ఎంట్రీ: లోకేష్ కనగరాజ్ DC మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు ఇవే

ప్రమోషన్ల సమయంలో నిర్మాతలు లేదా హీరోలు మాట్లాడే ప్రమోషనల్ మాటలు కూడా ప్రేక్షకులు సినిమా ఫలితాన్ని అంచనా వేయడానికి కీలకంగా మారుతున్నాయి. ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడే ధోరణి ఆధారంగానే ఫిల్మ్ బఫ్స్ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతోందో ముందే అంచనా వేస్తుంటారని చెప్పుకొచ్చారు.  

Naga vamsi, Lenin, Tollywood

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com