Home

»

Latest News

Dhruv vikram: ధ్రువ్ విక్రమ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ మూవీ ప్రారంభం..స్పెషల్ ఇదే   

Jul 2, 2026 2:51PM

 

ప్రొడక్షన్ బ్యానర్ ని ఒక బ్రాండ్ గా మార్చేసిన సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్'(Mytri.. హీరోలు, దర్శకులు, టెక్నీషియన్స్ మైత్రిలో చేయలని ఉవ్విల్లరుతూ ఉంటారు. సదరు సంస్థ ఇప్పుడు  సరికొత్త క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైవిధ్యభరితమైన నటనతో కోలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ డైనమిక్ హీరో, వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్‌తో  ఒక భారీ చిత్రాన్ని అనౌన్స్ చేసింది. 


ధ్రువ్ విక్రమ్ కెరీర్‌లో 4వ చిత్రంగా (DV4) రాబోతుండగా ఈ రోజు  ఉదయం పూజా కార్యక్రమాలతో అత్యంత ఘనంగా, వైభవంగా ప్రారంభమైంది. సినీ రంగ ప్రముఖులు విచ్చేసిన ఈ వేడుక సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోబోతున్న ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఒక సరికొత్త కాంబినేషన్ వెండితెరపై మ్యాజిక్ చేయబోతోంది.

మైత్రీ మూవీ మేకర్స్ కేవలం తెలుగులోనే కాకుండా ఇతర దక్షిణాది భాషల్లోనూ తమ మార్కెట్‌ను శరవేగంగా విస్తరిస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 4వ చిత్రం ఇదే కావడం విశేషం. గతంలో 'గుడ్ బాడ్ అగ్లీ' వంటి భారీ ప్రాజెక్టులను ప్రకటించిన ఈ సంస్థ, ఇప్పుడు ధ్రువ్ విక్రమ్ సినిమాతో కోలీవుడ్‌లో మరో బలమైన అడుగు వేసింది. ఈ క్రేజీ చిత్రాన్ని టాలెంటెడ్ నూతన దర్శకుడు కరణ్ అరవింద్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. కరణ్ గతంలో పలు సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి అనుభవం గడించారు. సబరి నాథ్, కరణ్ అరవింద్ కుమార్‌తో కలిసి స్క్రీన్‌ప్లే, కథను ఎంతో పవర్‌ఫుల్‌గా సిద్ధం చేశారు. యాక్షన్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ సమపాళ్లలో ఉండే పక్కా కమర్షియల్ మాస్ మసాలా కథతో  రూపొందిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

Also read: Rajinikanth: ఈ రోజు మంచి రోజు కావడంతో సాయంత్రం రజినీ కీలక ప్రకటన.. మీరు ఊహించిందే 

ఈ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకకు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు, ప్రముఖ నిర్మాతలు నవీన్ యెర్నేనీ, యలమంచలి రవిశంకర్‌లతో పాటు కోలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర దర్శకులు, నిర్మాతలు హాజరై చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. 'గుడ్ బాడ్ అగ్లీ' చిత్ర దర్శకుడు అధిక్ రవిచంద్రన్, 'డ్యూడ్' డైరెక్టర్ కీర్తీశ్వరన్ తదితరులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ చిత్రంలో ధ్రువ్ విక్రమ్ సరసన నటించే హీరోయిన్, అలాగే సంగీతం అందించే టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. పృథ్వీ పాండియరాజన్, సాయి దీన వంటి ప్రముఖ నటులు కీ రోల్స్   లో చేస్తున్నట్టుగా మేకర్స్ స్పష్టం చేశారు. వికీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జయసూర్య ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com