
తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాత ఎంఎస్ రాజు(Ms Raju)కి ఉన్న స్థానం ప్రత్యేకమైనది. సుమంత్ ఆర్ట్స్ క్రియేషన్స్ పై ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు. ముఖ్యంగా త్రిష(Trisha)తో ఆయన కాంబినేషన్ ఒక సువర్ణ అధ్యాయం. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి వంటి భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఈ కాంబో పెద్ద సంచలనమే సృష్టించింది.దీంతో ఆ మధ్య కేవలం నిర్మాత, నటి బంధమే కాకుండా ఒక బలమైన కుటుంబ బంధం ఏర్పడింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎంఎస్ రాజు, నటి త్రిషతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికరమైన, మునుపెన్నడూ వినని సంచలన విషయాలని పంచుకున్నారు.
ఆయన మాట్లాడుతు త్రిషకి నేనంటే ప్రాణం. నన్ను ఒక తండ్రిలా, దేవుడిలా గౌరవిస్తుం ది . సినిమా ఇండస్ట్రీలో ఒక అగ్ర నటి తన డేట్ డైరీని పూర్తిగా ఒక నిర్మాత చేతిలో పెట్టి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోండి అని చెప్పడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ త్రిష ఆ అవకాశం నాకు ఇచ్చింది. వర్షం సినిమా ఆడిషన్స్ సమయంలో మహేష్ బాబు ల్యాప్‌టాప్‌లో త్రిష ఫోటోని మొదటిసారి చూశాను. ఆమె లుక్స్ నచ్చి ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఎంపిక చేశాను. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే త్రిష తమ కుటుంబంలో ఒక సభ్యురాలిగా మారిపోయింది.
వర్షం సినిమా కోసం దాదాపు 75 రోజుల పాటు నిజమైన వర్షంలో తడుస్తూ క్లిష్టమైన సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు, ఒక దశలో త్రిష తట్టుకోలేక 'నా వల్ల కావడం లేదు' అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సమయంలో ఒక తండ్రి స్థానంలో నిలబడి ధైర్యం చెప్పడంతో, ఆమె తిరిగి రెట్టింపు ఉత్సాహంతో నటించి సినిమాను సూపర్ హిట్ చేసింది. అలాగే నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకు మొదట త్రిషను హీరోయిన్‌గా అనుకోకపోయినా, ఆమె స్వయంగా ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా మా ఇంటికి వచ్చి, భోజనం చేసి, స్క్రిప్ట్ బుక్ తీసుకుని వెళ్లడం ఆమె అంకితభావానికి నిదర్శనం.
అయితే, వీరిద్దరి మధ్య జరిగిన ఒక క్రేజీ అలక సంఘటనను ఎంఎస్ రాజు నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. సిద్ధార్థ్ హీరోగా తాను నిర్మించిన 'ఆట' సినిమాలో హీరోయిన్‌గా ఇలియానాను ఎంపిక చేసినప్పుడు త్రిష తీవ్రంగా అలిగిందట. "ఆట సినిమాలో నన్ను కాకుండా ఇలియానాను ఎలా హీరోయిన్‌గా పెట్టుకుంటారు? నేను రేపే షూటింగ్‌కు వచ్చేస్తాను" అంటూ ఫోన్ చేసి మరీ గొడవ పడింది. అప్పటికే రాజమండ్రిలో నది మధ్యలో బోటుపై షూటింగ్ ప్రారంభం కావడంతో త్రిషని శాంతింపజేయాల్సి వచ్చింది. ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో రాత్రి 3 గంటలకు మీకు ఏదైనా సమస్య వస్తే ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడతారు అని ప్రశ్నిస్తే.. త్రిష ఏమాత్రం ఆలోచించకుండా 'ఎమ్మెస్ రాజు' అని నా పేరు మాత్రమే చెప్పింది. ఆ నమ్మకమే నన్ను ఇప్పటికీ బంధించి ఉంచిందని రాజు ఎమోషనల్ అయ్యారు.






