Home

»

Latest News

Disha Patani: ఆ హీరోయిన్ విడాకులకి దిశా పటానీ కారణమా! మౌనంగా ఉంటే నిజమైపోతుందా!

May 19, 2026

 

విశ్వంభర ఫేమ్ మౌని రాయ్(Mouni Roy)సూరజ్ నంబియార్(suraj nambiar)నాలుగు సంవత్సరాల తమ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించినప్పటి నుండి, ఆ ఇద్దరు విడిపోవడానికి కారణాలు ఇవే అంటు ఇండస్ట్రీలో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా మౌనీ రాయ్ భారీ మొత్తంలో భరణం డిమాండ్ చేసిందని, స్టార్ హీరోయిన్ దిశా పటానీ(Disha Patani)కూడా ఆ ఇద్దరు విడిపోవడానికి కారణమనే రూమర్స్ ఐతే ఒక రేంజ్ లోనే చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై  సూరజ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా ఒక నోట్ రిలీజ్ చేసాడు

తన నోట్ లో' మౌని రాయ్, నేను పరస్పర గౌరవంతో, ఒకరి శ్రేయస్సుని మరొకరు కాంక్షిస్తూనే విడిపోవాలనే ఉమ్మడి నిర్ణయాన్ని తీసుకున్నాం. ఈ క్రమంలో ఎలాంటి భరణం  వివాదాలు రాలేదు. అలాగే మా మధ్య ఎలాంటి మనస్పర్థలు, విభేదాలు గానీ లేవు. ఈ సున్నితమైన సమయంలో మా వ్యక్తిగత జీవితాలని వ్యాపార వస్తువులుగా మార్చవద్దు. ముఖ్యంగా మా విడాకుల విషయంలోకి ఎలాంటి సంబంధం లేని దిశా పటానిని  లాగడం ఏమాత్రం సమంజసం కాదు.

Also read: Jana Nayagan: జననాయగన్ తెలుగు బిజినెస్ క్రేజ్.. సీఎం రేంజ్ లెక్కలివే!

 మీడియా సంస్థలు కనీస వెరిఫికేషన్ లేకుండా ఇలాంటి కల్పిత కథనాలని  ప్రచురించడం చాలా అన్యాయం. మౌనంగా ఉంటే అబద్ధాలనే నిజాలుగా నమ్మే ప్రమాదం ఉందనే ఉద్దేశంతోనే స్వయంగా వివరణ ఇస్తున్నట్లు తన నోట్ లో పేర్కొన్నాడు. దీంతో రూమర్స్ సృష్టిస్తున్న వాళ్ళకి  తీరని అన్యాయం జరిగిందని చెప్పవచ్చు.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com