మోక్షజ్ఞ రెమ్యునరేషన్ ఇంతేనా!
on Sep 9, 2024
నటసింహం నందమూరి బాలకృష్ణ(balakrishna)వారసుడు యువ సింహం మోక్షజ్ఞ(mokshagna)ఫస్ట్ సినీ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న నందమూరి అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు.దీంతో మూవీ ఎప్పుడెప్పుడు షూట్ కి వెళ్తుందా, ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేసుకొని సిల్వర్ స్క్రీన్ మీద అడుగుపెడుతుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.దీంతో అప్ డేట్స్ కోసం ప్రతి రోజు సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ఒక న్యూస్ అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకులోను ఆసక్తిని కలగ చేస్తుంది.
మోక్షజ్ఞ డెబ్యూ మూవీని లెజండ్ ప్రొడక్షన్స్ పై బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని నిర్మించబోతోంది. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ(prashanth varma)దర్శకుడు. ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొందిన కథను తెరకెక్కనుంచబోతున్నామని స్వయంగా ప్రశాంత్ నే చెప్పాడు. ఇప్పుడు లేటెస్ట్ గా మోక్షజ్ఞ అందుకోబోయే పారితోషికం ఇదే అనే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అక్షరాలా ఇరవై కోట్ల రూపాయలని రెమ్యునరేషన్ గా తీసుకోబోతున్నాడని అంటున్నారు.ఈ వార్తలో నిజమెంత ఉందో గాని మోక్షజ్ణ కనుక ఇరవై కోట్లని తీసుకుంటే కనుక, ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ మొత్తంలో ఫస్ట్ మూవీకి హయ్యస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న తొలి హీరోగా మోక్షజ్ఞ చరిత్ర సృష్టించినట్టే.
ఇక మోక్షజ్న సినీ ఎంట్రీ కి సంబంధించి చాలా మంది సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. తాత, తండ్రి లాగా నటనలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు అందుకోవాలని ఆశిస్తున్నటుగా తెలిపారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై స్పందించి నందమూరి అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు.నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాత ఆశీస్సులతో పాటు దైవిక శక్తులు ఆశీస్సులు కూడా ఉంటాయని ఎన్టీఆర్ ట్వీట్ చేసాడు.