Home

»

Latest News

మోహన్‌బాబుకి షాకిచ్చిన మూడక్షరాలు...!

Sep 4, 2018 12:36PM

హీరోయిజం, కామెడీ, విలనిజం.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రను పండించడంలో సిద్ధహస్తుడు మోహన్ బాబు. ఈ తరహా పాత్రలన్నింటినీ చేసి ‘కలెక్షన్ కింగ్’గా టాలీవుడ్ ప్రస్థానంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నారు మోహన్‌బాబు. ఇటీవల ఓ ప్రముఖ ఛానల్‌కి మొహన్‌బాబు తన కుమార్తె లక్షీతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో మోహన్‌బాబు మాట్లాడుతూ... నేను ఇంత ఎత్తుకు ఎదగటానికి కారణం నా గురువుగారు దాసరిగారు అన్నారు. డైలాగ్ డెలివరీలో ఎన్టీయార్‌ని అనుసరించేవాడినని, గురువుగారు దాసరి ఇచ్చే విలువైన సూచనల్ని పాటిస్తూ డైలాగ్స్ చెప్పడంలో కింగ్‌లా పేరు తెచ్చుకున్నానని మోహన్‌బాబు చెప్పారు. ఇదే సందర్భంలో తన పక్కనే వున్న లక్షి నాన్నగారు ఈ సందర్భంలో మీరు ఎదైనా ఒక డైలాగ్ మాకోసం చెప్పండి అని అడిగింది. కూతురి కోరిక మేరకు మోహన్‌బాబు ‘ఎం ధర్మరాజు ఎంఏ’ మూవీలో తను పోషించిన తండ్రీకొడుకుల పాత్రలకు సంబంధించి ఒక డైలాగ్ చెబుతూ.. తనదైన స్టైల్లో ‘ఫసక్’అని పుసుకున అనే సరికి ఇప్పుడు ‘ఫసక్’ అనే మూడక్షరాల మాట మోహన్‌బాబుకి పిచ్చెక్కిస్తోంది. అసలు విషయం ఏమిటంటే... తాను ఏదో సరదాగా చెప్పిన ‘ఫసక్’ అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం యూత్ వాడుకునే కామన్ పదం ‘కసక్’ అనే దానిలో నుంచి ‘క’ను తోలగించి ‘ఫసక్’అని యూత్ వాడుతున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com