Home

»

Latest News

మెగాస్టార్ గురించి ఆ వార్త అబద్ధం.!

Aug 6, 2026 2:50PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి బాధ్యతలు స్వీకరిస్తున్నారంటూ ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై తాజాగా మెగాస్టార్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. దయచేసి ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఎవరికీ షేర్ చేయవద్దని చిరు టీమ్ కోరింది.

'ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి' అంటూ ఇటీవల టాలీవుడ్ వర్గాల్లో, పొలిటికల్ సర్కిల్స్‌లో ఒక వార్త హల్‌చల్ చేసింది. గుజరాత్ టూరిజం కోసం బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసినట్లే.. ఏపీ టూరిజం, ఇన్వెస్ట్‌మెంట్లను ప్రమోట్ చేయడానికి చిరంజీవిని రంగంలోకి దించుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేశాయి. అందుకే మెగాస్టార్ టీమ్ రంగంలోకి దిగి, ఈ వార్తలకు చెక్ పెట్టింది. తాజా ప్రకటనతో ఇవన్నీ ఫేక్ న్యూస్ అని తేలిపోయింది.

 

 

Chiranjeevi, AP Brand Ambassador, Fake News

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com