Home

»

Latest News

వెంకన్న సన్నిధిలో సచిన్, చిరంజీవి, నాగార్జున..!

Jun 01, 2016

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ లు వెంకన్న దర్శనానికి తిరుపతి చేరుకున్నారు. యాదృచ్ఛికంగా సచిన్ కూడా ఇదే సమయానికి తిరుపతికి వచ్చాడు. అందరూ కలిసి ఈరోజు గెస్ట్ హౌస్ లో స్టే చేసి, రేపు వివిఐపి దర్శన సమయంలో స్వామి దర్శనం చేసుకుంటారని సమాచారం. త్వరలోనే నాగార్జున వెంకటేశ్వర స్వామి భక్తుడైన హాథీరాం బాబా గురించి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి తన 150 వ సినిమా కోసం, అల్లు అరవింద్ సరైనోడు సక్సెస్ సందర్భంగానూ తిరుపతి దర్శనానికి వచ్చారు. ఆసక్తికర అంశం ఏమిటంటే, నాగార్జున, చిరంజీవి, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ లు నలుగురూ ఒకప్పుడు మాటీవీ పార్టనర్స్. ఆ తర్వాత పార్టనర్ షిప్ విడిపోయినా వీరి స్నేహం కొనసాగింది. లేటెస్ట్ గా ఈ నలుగురూ మరో వెంచర్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com