Home

»

Latest News

గాయకుడు జి ఆనంద్‌కు ఏడు దేశాల నుంచి సెల‌బ్రిటీల నివాళి

May 10, 2021

 

ఇటీవ‌ల క‌రోనాతో పోరాటం చేస్తూ క‌న్నుమూసిన నిన్న‌టి త‌రం మ‌ధుర గాయ‌కుడు జి. ఆనంద్‌కు ఏడు దేశాల నుంచి ప‌లువురు సెల‌బ్రిటీలు అంత‌ర్జాలంలో బాధాతప్త హృదయంతో  నివాళు లర్పించారు. ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత రంగంలో గాయకుడిగా కొనసాగిన ఆనంద్‌, "స్వరమాధురి" సంస్థను స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా 6500కు పైగా కచేరీలు నిర్వహించారు. ఎంతో మంది గాయనీ, గాయకులను ఆయన తయారు చేశారు.

ఆనంద్ కరోనా సమయంలో సరైనటు వంటి  వైద్య సదుపాయం అందక మరణించిన తీరును అందరూ ప్రస్తావిస్తూ కళాకారులు జాతి సంపదగా అభివ‌ర్ణిస్తూ వారిని కాపాడు కోవలసిన అవసరం ప్రతి దేశానికి వున్నదనీ, కరోనా విపత్కర సమయంలో కళాకారులను ప్రత్యేకంగా ఆదుకునే విధానం  ప్రభుత్వాలు పరిశీలించాలనీ ఆనంద్ కు నివాళులర్పిస్తూ అన్నారు. ఈ అంతర్జాల కార్యక్రమాన్ని వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా , సంతోషం ఫిలిం న్యూస్ ఇండియా , శారద ఆకునూరి అమెరికా  సంయుక్త ఆధ్వర్యంలో  అమెరికాలో హ్యూస్టన్ నగరం నుండి శారద ఆకునూరి నిర్వహణలో ప్రారంభించారు. 

న్యూ జెర్సీ నుండి దాము గేదెల అంతర్జాతీయంగా ఆనంద్ పేర ఒక సంగీత పురస్కారాన్ని నెలకొల్పుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు, మాజీ పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ, ఆనంద్ తన ఎన్నో చిత్రాల పాటలకు గాత్రం ఇచ్చారని, వారి సుమధుర గీతాలు తన పాత్రలకు న్యాయం చేశాయని అన్నారు. అమెరికాకు చెందిన ఉపేంద్ర చివుకుల అమెరికాలో ఆనంద్ గారి గానాన్ని చాలా సార్లు  విన్నానని, వెంటిలేటర్ దొరకక ఒక గాయకుడు మరణించడం తమనెంతో కలచి వేసిందని అన్నారు. 

ఈ అంతర్జాల నివాళి సభలో మండలి బుద్ధ‌ ప్రసాద్ , ఘంటసాల రత్నకుమార్,  భువన చంద్ర , మాధవ పెద్ది సురేష్, RP  పట్నాయక్, సురేష్  కొండేటి, సారిపల్లి  కొండలరావు , డా నగేష్ చెన్నుపాటి, ఉపేంద్ర చివుకుల, ప్రసాద్ తోటకూర, డా ఆళ్ల శ్రీనివాస్ , శారద సింగిరెడ్డి, మహమ్మద్ రఫీ, దాము గేదెల, రవి కొండబోలు, శ్రీదేవి జాగర్లమూడి, శ్రీనివాస్ చిమట, రమణ జువ్వాది, రత్న కుమార్ కవుటూరు, తాతాజీ ఉసిరికల, అనిల్, హరి వేణుగోపాల్, రామాచారి, మల్లికార్జున్, రాము, ప్రవీణ్ కుమార్ కొప్పుల, వేణు శ్రీరంగం , సురేఖా మూర్తి దివాకర్ల, GV ప్రభాకర్, విజయలక్ష్మి చంద్రతేజ,  తదితరులు ఆనంద్‌తో తమ అనుబంధాన్ని పంచుకొని శ్రద్ధాంజలి ఘటించారు. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com