
తెలుగు సినిమా తన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నంత కాలం నటప్రపూర్ణ, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట ప్రస్థానానికి ఉన్న చరిష్మా వెలుగుతూనే ఉంటుంది. ప్రీవియస్ మూవీ శ్రీనివాస మంగాపురంతో మరో సారి తన సత్తా చాటాడు. ఒక సాధారణ నటుడిగా అడుగుపెట్టి, స్వయంకృషితో ఎదిగిన మోహన్ బాబు ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. అయితే ప్రతి ఒక్కరి జీవితంలోనూ తమ మొదటి సంపాదన లేదా మొదటి వాహనంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. మోహన్ బాబు జీవితంలో కూడా ఆయన సొంతంగా కొనుగోలు చేసిన మొట్టమొదటి కారు వింటేజ్ 'ప్రీమియర్ పద్మిని' (Premier Padmini). నాటి రోజుల్లో హోదాకు, శ్రమకు ప్రతీకగా నిలిచిన ఆ క్లాసిక్ కారు, దశాబ్దాల పాటు మంచు వారి ఇంట్లో ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. కాలక్రమేణా పాతబడిపోయిన ఆ కారుకి ఇప్పుడు ఆయన తనయుడు, నటుడు నిర్మాత మంచు విష్ణు సరికొత్త రూపునిచ్చి మళ్లీ రోడ్డెక్కించారు.
Also Read: 120 కోట్ల రిస్క్ సేఫ్ అవుతుందా? ఒడ్డున పడతాడా?
దశాబ్దాల నాటి ఇంజిన్, బాడీ షేప్, ఇంటీరియర్ డిజైన్‌ను ఏమాత్రం దెబ్బతినకుండా, పూర్తిస్థాయిలో ఆధునిక స్పర్శతో సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు. ఈ రీస్టోరేషన్ పూర్తయిన తర్వాత మెరుస్తున్న ఆ పాత పద్మిని కారు వీడియోను మంచు విష్ణు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. "కొన్ని వస్తువులు కేవలం యంత్రాలు మాత్రమే కాదు, అంతకుమించిన భావోద్వేగాలు. ఈ వింటేజ్ ప్రీమియర్ పద్మిని మా నాన్నగారి మొట్టమొదటి కారు. మళ్లీ ప్రాణం పోయాల్సిన అత్యంత విలువైన జ్ఞాపకం ఇది. చాలా ప్రేమతో, ప్రతీ చిన్న విషయాన్నీ శ్రద్ధగా గమనిస్తూ దీనికి పాత వైభవాన్ని తీసుకొచ్చాం. ఇది మా కుటుంబ చరిత్రలో ఒక అపురూపమైన భాగం" అని విష్ణు ఎంతో భావోద్వేగంగా రాసుకొచ్చారు.
Mohan Babu, Manchu Vishnu






