Home

»

Latest News

Manchu manoj: వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మంచు వారు పోటీ... హెల్మెట్ మర్చిపోరుగా!

May 19, 2026

 


భైరవం, మిరాయ్ తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన మంచు మనోజ్(Manchu Manoj)రేపు మే 20న 43 వ పడిలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సంధర్భంగా ఈ రోజు  తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ వేదికపైనే మంచు మనోజ్ భవిష్యత్తు రాజకీయాలపై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 

మనోజ్ మాట్లాడుతు మౌనిక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి  పోటీ చేయబోతుంది. సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక ఉమ్మడి వేదికని కల్పించాలనే ఉద్దేశంతో  'ఐక్య ధైర్య సేన సమితి' అనే  సామాజిక సేవా సంస్థని ప్రారంభిస్తున్నాం. సేవ అంటే మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలనే ఉద్దేశంతో, ఈ సంస్థని ప్రారంభిస్తున్నాం. అందులో భాగంగా మొదటి రోజే ఐదుగురు అనాథ పిల్లలని  దత్తత తీసుకుంటున్నాం.  ఆ ఐదుగురు పిల్లల పూర్తి విద్యాభ్యాసం, వారి భవిష్యత్తు బాధ్యతలని మేమే పూర్తిగా భరిస్తాం. ఈ సేవా కార్యక్రమాలు కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం కాకుండా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వంటి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పట్టణానికి, ప్రతి గ్రామానికి విస్తరిస్తాం.  మా సంస్థ ద్వారా ఏ ఒక్కరికైనా నిజమైన సహాయం అందితే, అదే తమ జీవితంలో సాధించిన అతిపెద్ద విజయంగా భావిస్తామని మనోజ్ అన్నారు.


Also read: Ram Pothineni: రియల్ హీరోగా మారిన రామ్... అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఫ్యాన్ ఇంటికి వెళ్లి పరామర్శ

ఒక విలేకరి మనోజ్ తో మీ నాన్నతో గొడవలు తగ్గాయా అని అడగగానే మనోజ్ బదులిస్తూ   'ఈ ప్రశ్న ఎవరిని అడగాలో మీకు తెలుసు. కానీ మైక్ తో వెళ్ళకండి, ఒక వేళ వెళ్ళినా హెల్మెట్ పెట్టుకొని వెళ్లండని సరదాగా చెప్పాడు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com