
'ప్రేమలు' మూవీతో యూత్ హార్ట్స్ లో తిష్ట వేసిన భామ మమితా భైజు. రీసెంట్ గా విశ్వనాధ్ అండ్ సన్స్ తో భారీ హిట్ అందుకొని సౌత్ ఇండియా క్రేజీ హీరోయిన్ గా మారింది. ఇప్పుడు ఉన్నట్టుండి హఠాత్తుగా ఆసుపత్రిలో జాయిన్ కావడం అభిమానులతో పాటు పరిశ్రమ వర్గాలని షాక్ కి గురి చేస్తుంది.
హాస్పిటల్ లో జాయిన్ కావడానికి గల కారణాన్ని అధికారకంగా ప్రకటించకపోయినా జ్వరం, , ఆస్తమా, అలర్జీ లాంటి సమస్యలతో బాధపడుతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ నెల 5న ఆస్ట్రేలియా దేశంలోని మెల్‌బోర్న్‌లో జరగాల్సి ఉన్న 'క్లైడ్ మలయాళీ' ఓణం వేడుకలకి మమిత చీఫ్ గెస్ట్ గా హాజరుకావాల్సి ఉంది. దీంతో ఆ పర్యటన కూడా రద్దయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా మమిత బైజూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆ వీడియోలో 'ఆస్ట్రేలియా పర్యటన రద్దు కావడం నాకు చాలా పెద్ద లోటు. అనుకున్న దాని ప్రకారం రాలేకపోతున్నందుకు ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాను. వీలైతే ఎలాగైనా రావాలని అనుకున్నాను కానీ ఆరోగ్య పరిస్థితి సహకరించడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: సంకల్ప సాధకుడు కల్యాణ్ బాబు.. తమ్ముడికి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్
మమిత ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలిసిన వెంటనే ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.సినిమాలతో నిరంతరం బిజీగా గడపడం, తీవ్రమైన పని ఒత్తిడి వల్లనే ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో మమిత బైజూ ఇలా ఆసుపత్రి పాలవ్వడం అందరినీ కలవరపెట్టినప్పటికీ, వైద్యుల పర్యవేక్షణలో ఆమె త్వరలోనే కోలుకొని మళ్లీ షూటింగ్‌లలో పాల్గొంటారని అభిమానులు ఆశిస్తున్నారు.
[ Mamitha Baiju, Hospitalised, viswandh And Sons, Premalu, Telugu Cinema, Telugu Cinema News, Tollywood ]







