
విశ్వనాధ్ అండ్ సన్స్ లో 'మాడీగా' అద్భుతమైన పెర్ఫార్మ్ ప్రదర్శించి, ఇక కెరీర్ లో వెనక్కి తిరి చూసుకునే అవకాశం లేకుండా చేసుకుంది మమిత బైజు. ఆ వెంటనే రీసెంట్ గా స్వంత భాషలో తెరక్కేక్కిన 'బెత్లహోమ్ కుటుంబ యూనిట్' తో మరో భారీ హిట్ అందుకొని సౌత్ ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ వద్ద టాక్ అఫ్ ది డే గా నిలిచింది.
ఆమె నటించిన చిత్రాలని ఏడాదిలోపు చూసుకుంటే విజయ్ జన నాయగన్ 300 కోట్లు రాబట్టింది. ప్రదీప్ రంగనాధన్ తో చేసిన డ్యూడ్ 100 కోట్లు, విశ్వనాధ్ అండ్ సన్స్ 260 కోట్లు, ధనుష్ తో చేసిన కర 55 కోట్లు, మరోవైపుబెత్లహోమ్ కుటుంబ యూనిట్' స్టిల్ 310 కోట్లరూపాయలతో దూసుకుపోతుంది. ఇలా వన్ ఇయర్ లోపే 1000 కోట్లు రాబట్టి తన కట్ అవుట్ రేంజ్ ని పెంచుకుంటూ వెళ్తుంది.

Also Read: ప్యారడైజ్ రిజల్ట్ పైనే చిరు మూవీ భవిష్యత్తు: ఎందుకు, ఏమిటి,ఎలా!
కేరళలోని కొట్టాయంకి చెందిన చెందిన మమిత భైజు ఏ క్యారక్టర్ లోకైనా పరకాయ ప్రవేశం చేసి కాన్ఫిడెన్స్ తో కూడిన నటనని ప్రదర్శించడంలో దిట్ట. అందుకే అభిమాన ఘనాన్ని, సినిమాల లిస్ట్ ని పెంచుకుంటూ వెళ్తుంది. 2016 లో 'పావడ' అనే చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి, 'ప్రేమలు' మూవీతో ప్రేక్షకుల హృదయాల్లో కుర్చీ వేసుకొని కూర్చుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి డై హార్ట్ ఫ్యాన్.
[Mamitha Baiju, viswanadh And Sons, 1000 Crore Club, bethlehem kudumba unit , Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





