Home

»

Latest News

Ranjith: లైంగిక ఆరోపణల నేపథ్యంలో సంచలన దర్శకుడు అరెస్ట్ 

Apr 01, 2026

 

-చిత్ర సీమని కుదిపేసిన దర్శకుడి అరెస్ట్ 
-రెండుసార్లు కోర్టు కొట్టివేసింది
-ఇప్పుడు మూడోసారి ఏకంగా అరెస్ట్ 
-పూర్తి డీటెయిల్స్ చూద్దాం


రంజిత్ బాలకృష్ణన్(Ranjith Balakrishnan).. మలయాళ చిత్ర సీమలో క్రియేటివ్ దర్శకుడుగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. నటుడుగా, రచయితగా అనేక చిత్రాలకి పని చేసి 2001లో దర్శకుడిగా మారి ఇప్పటి వరకు సుమారు ఇరవై రెండు చిత్రాల వరకు తెరకెక్కించాడు. రీసెంట్ గా రంజిత్ పై ఒక నటి లైంగిక ఆరోపణల చేయడంతో కొచ్చి పోలీసులు అరెస్ట్ చెయ్యడం సంచలనంగా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

ఒక సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు రంజిత్  తనని కారవాన్‌లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, లైంగికంగా వేధించడానికి ప్రయత్నించారని సదరు నటి జస్టిస్ హేమ కమిటీతో పాటు పోలీసులకి ఫిర్యాదు  చేసింది. ఈ మేరకు కొచ్చి సిటీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అత్యంత రహస్యంగా సాగిన ఈ ఆపరేషన్‌లో ఇడుక్కి జిల్లాలో ఉన్న రంజిత్‌ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.


రంజిత్ పై  2024లోను ఒక బెంగాలీ నటి లైంగిక ఆరోపణల కేసు నమోదు చేసింది.  2009లో 'పలేరి మాణిక్యం' సినిమా షూటింగ్ సమయంలో కొచ్చిలోని గెస్ట్ హౌస్‌లో రెంజిత్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని, లైంగిక దాడికి ప్రయత్నించారనేది ఆమె ఆరోపణ. దీంతో  పోలీసులు విచారణ జరిపి కోర్టులో ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారు. గత అక్టోబర్‌లో విచారణకి రాగా 2009లో జరిగిన ఘటనపై కేసు నమోదు చేయడానికి మెజిస్ట్రేట్ కోర్టుకి ఉన్న కాలపరిమితి ముగిసిపోయిందని హైకోర్టు తన తీర్పుని వెల్లడి చేస్తూ కొట్టివేసింది.

 2012లో బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో డైరెక్టర్ రెంజిత్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని,  దుస్తులు లేని చిత్రాలు కూడా తీశాడని కోజికోడ్‌ కి చెందిన ఒక యువకుడు ఫిర్యాదు చేశాడు.దీంతో ఎర్నాకుళం నార్త్ పోలీసులు రెంజిత్‌పై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, ఫిర్యాదు చేయడానికి 12 ఏళ్లు ఆలస్యమైందన్న కారణంతో కర్ణాటక హైకోర్టు 2025 జులైలో ఆ కేసుని కూడా రద్దు చేసింది. అలాంటిది ఇప్పుడు  మూడో సారి లైంగిక ఆరోపణలతోనే రంజిత్ అరెస్ట్ కావడం గమనార్హం. రంజిత్ నుంచి గత ఏడాది ఆరో, సమ్ వన్ అనే షార్ట్ ఫిలిం వచ్చింది. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com