Home

»

Latest News

Varanasi: 'వారణాసి' నుండి క్రేజీ అప్‌డేట్.. మహేష్ కోసం జక్కన్న భారీ ప్లాన్!

May 25, 2026 10:51AM

సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ అడ్వెంచర్ ఫిల్మ్ 'వారణాసి' (Varanasi) గురించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ హల్‌చల్ చేస్తోంది. 

ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి జూన్ రెండో వారం నుండి అత్యంత కీలకమైన, సుదీర్ఘమైన యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ కొత్త షెడ్యూల్‌లో మహేష్ బాబుపై అంతర్జాతీయ స్టంట్ మాస్టర్ల పర్యవేక్షణలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కేవలం ఈ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసమే సుమారు నెలకు పైగా నాన్-స్టాప్ షూటింగ్ సాగనుండటం విశేషం.

ఈ సినిమాలో మహేష్ బాబు 'రుద్ర' అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే శ్రీరాముడిగానూ కనువిందు చేయనున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే పవర్ ఫుల్ నెగటివ్ రోల్ చేస్తుండగా,  గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో 'మందాకిని' అనే కీలక పాత్రలో నటిస్తోంది. 

ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7, 2027న థియేటర్లలోకి తీసుకురానున్నారు మేకర్స్. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలతో తెలుగు సినిమా జెండాను ప్రపంచవ్యాప్తంగా ఎగురవేసిన రాజమౌళి, ఈసారి మహేష్ బాబుతో కలిసి సరికొత్త గ్లోబల్ వండర్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com